ఆర్థరైటిస్ అనేది కీళ్ళను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల పుండ్లు పడడం, కీళ్ళు గట్టిగా మారడం ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఆర్థరైటిస్‌లో 100 కంటే ఎక్కువ స్టేజెస్ ఉంటాయి. ప్రతిది కూడా వేర్వేరు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇది పిల్లలు, యువకులనూ కూడా ప్రభావితం చేస్తుంది. అలాంటి సమస్యలకు సైక్లింగ్ చెక్ పెడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది.
అసలు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఈ సైక్లింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుందనేది ఈ పరిశోధనలో సవివరంగా తెలిపింది. శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో జీవితంలో కనీసం ఒక్కసారైన సైక్లింగ్ చేసే అలవాటు ఉన్నవారికి మోకాళ్ల నొప్పులు వచ్చే అవకాశం 17% తక్కువగా ఉందని, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం 21% తక్కువగా ఉందని వెల్లడయ్యింది. అందుకోసం 60 ఏళ్ల లోపు సుమారు రెండు వేలకు పైగా వ్యక్తుల డేటాను విశ్లేషించి మరీ పేర్కొంది.
ఈ పరిశక్షధన మెడిసిన్ అండ్ సైన్స్‌లో ప్రచురితమయ్యింది. స్పోర్ట్స్ అండ్ ఎక్సర్‌సైజ్‌లో ఆరుబయట చేసే సైక్లింగ్ మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులను నివారిస్తుందని గుర్తించారు శాస్త్రవేత్తలు. తమ పరిశోధనల ఆధారంగా జీవితాకాలంలో సైకిల్ తొక్కడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గడం తోపాటు మెరుగైన మోకాలి ఆరోగ్యం ఉంటుందని, పైగా ఈ ప్రమాదం బారినపడే అవకాశం తక్కువగా ఉంటుందని రుమాటాలజీ చీప్ డాక్టర్ గ్రేస్ అన్నారు.
అంతేగాదు ఎక్కువ సమయం సైకిల్‌పై గడిపితే అతడు లేదా ఆమెకు మోకాళ్ల నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. అలాగే 12 నుంచి 50 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు వారి డేటాను ట్రాక్ చేయగా వారిలో సగానికిపైగా మంది సైక్లింగ్‌ని తమ రోజువారి వ్యాయమంలో భాగం చేసినట్లు తెలిపారు. వారందరిలో క్వాడ్రిస్‌ప్‌లు బోలపేతమయ్యాయని అన్నారు. వారంతా సైక్లింగ్‌ని మానేసిన తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగిందన్నారు.
సైక్లింగ్ వల్ల కలిగే లాభాలు..
రన్నింగ్ లేదా జంపింగ్ వంటి అధిక ప్రభావ వ్యాయామాలతో పోలిస్తే సైక్లింగ్ అనేది ప్రభావ చర్య కీళ్లపై తక్కువ ఒత్తిడిని కలగజేస్తుంది. మోగాలి గాయాల ప్రమాదాన్ని తగ్గిండానికి, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
మోకాళ్ల చుట్టూ ఉండే కండరాలను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా క్వాడ్రిస్ప్స్, హామ్ స్ట్రింగ్స, కండరాలు బలంగా ఉన్నప్పుడు, మోకాలి కీలుకు మెరుగైన మద్దతునిచ్చి, తద్వారా గాయలయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
క్రమం తప్పకుండా సైకిల్ నడుపుతున్నప్పుడు కదలికల పరిధిని నిర్వహించడానికి, మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పెడలింగ్ సైనోవియల్ ద్రవం ప్రవాహంలో సహాయపడుతుంది. ఇది కీళ్ల సరళతకు తోడ్పడుతుంది.
అలాగే బరువు నిర్వహణలో సహాయపడుతుంది. శరీరంలోని కేలరీలను బర్న్ చేయడానికి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సైక్లింగ్ మంచి మార్గం. అధిక బరువు మోకాళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. అందువల్ల, సైక్లింగ్ ద్వారా మీ బరువును నిర్వహించడం చాలా ముఖ్యం. ఇది ఒత్తిడిని తగ్గించడంలో, మోకాలి సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
(చదవండి: ఆ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే బరువు తగ్గుతారు! పోషాకాహార నిపుణులు)
Comments
Please login to add a commentAdd a comment