బరువు తగ్గే ప్రయాణంలో చాలా మంది పలు రకాల వర్కౌట్‌లు, డైట్‌పై దృష్టిపెడతారు. కానీ ఎలాంటి ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతున్నాం అనేదాన్ని గమనించరని పోషకాహార నిపుణురాలు ఖ్యాతి రూపాని అంటున్నారు. మన తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరంగా ఉండే ఆహారాలు మన బరువు తగ్గేందుకు ఆటంకం కలిగిస్తాయని చెబుతున్నారు. అలాంటి వాటిని ఎంత మేర వరకు తీసుకుంటే బెటర్ అనేది అంచనా వేసి తీసుకోవాలని తెలిపారు.
అలాగే ఎక్కువ కేలరీల ఆహారం తీసుకున్న రోజు కచ్చితంగా బాగా హెల్తీగా ఉండే ఆహారాలను తీసుకోకుండా ఉండటం వంటి జాగ్రత్తలు పాటిస్తే బరువు ఈజీగా తగ్గుతారని చెబుతున్నారు. ఈ సందర్భంగా తన వెయిట్ లాస్ జర్నీలో తాను ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలను దూరం పెట్టడం వల్ల ఎంత తొందరగా బరువు తగ్గగలిగానే అనే విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.
ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం, బరువు తగ్గడానికి తినడం అనేవి రెండు వేర్వేరు పరిస్థితులని నొక్కి చెప్పారు. వాటితో సరిగా వ్యవహరించాలని, అన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు తక్కువ కేలరీలు లేదా కొవ్వు రహిత పదార్థాలుగా భావించడం బరువు తగ్గే ప్రయత్నాలకు ప్రధాన ఆటంకాలని అన్నారు. అంతేగాదు క్యాలరీలు మనల్ని ఎలా తికమకకు గురిచేస్తాయో కూడా వివరించారు. మన ఆహారంలో కొవ్వులు కీలకమైనవే కానీ ఇవి కార్బోహైడ్రేట్లు లేదా ప్రోటీన్‌తో పోలిస్తే గ్రాముకు రెట్టింపు క్యాలరీలను ప్యాక్ చేస్తాయి.
ఉదాహరణకు ఒక గ్రాము కొవ్వు 9 కేలరీలను ఇస్తుంది. అయితే ఒక గ్రాము కార్బోహైడ్రేట్లు లేదా ప్రోటీన్ 4 కేలరీలను మాత్రమే ఇస్తుంది. ఇలాంటప్పుడు విజయవంతంగా బరువు తగ్గాలనుకుంటే సముతుల్యత పాటిస్తూ..తక్కువ కేలరీలు, ఫైబర్లు, ప్రోటీన్లు అధికంగా ఉండేలా, కొవ్వు లేకుండా చేసుకోవాలని చెబుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక టేబుల్ స్పూన్ వెన్నలో 50 కేలరీల కంటెంట మొత్తం మీకు ఒక యాపిల్‌తో విభేదిస్తుంది.
ఎందుకుంటే..? ఇందులో ఏకంగా 90 కేలరీలు ఉంటాయి, పైగా కొవ్వు ఉండదు, ఫైబర్ పుష్కలంగా ఉండి ఎక్కువ సేపే ఆకలి లేకుండా చేస్తుంది. అందువల్ల వెయిట్ లాస్ జర్నీలో బరువుని ఆటంకపరిచే ఐదు ఆరోగ్యకరమైన ఆహారాల గురించి సవివరంగా వెల్లడించారు పోషకాహార నిపుణులు ఖ్యాతి రూపానీ.
అవేంటంటే..
అవోకాడో: ఆరోగ్యకరమైన కొవ్వులు కోసం తరుచుగా సూపర్‌ఫుడ్‌గా పేర్కొన్నప్పటికీ..కేలరీల పంచ్ ప్యాక్‌ని అందిస్తుంది. ఇవి 100 గ్రాముల అవోకాడోకి సుమారు 200 కేలరీలు, 19 గ్రాముల కొవ్వులు ఉంటాయి. అందువల్ల దీన్ని డైట్‌లో చేర్చుకునేటప్పుడూ మితంగా ఉండేలా చూసుకోవటం ముఖ్యం.
స్మూతీస్: ఈ స్మూతీస్‌లో మంచి తృణధాన్యాలు, వెన్న, పాలతో లోడ్ చేసే కేలరీల లోడ్. దీన్ని ఆస్వాదించేటప్పుడూ కూడా జాగురుకతతో వ్యవహరించాలి. సమతుల్యంగా తీసుకోవాలి.
నట్ బట్టర్: ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉన్నప్పటికీ నట్ బట్టర్ శరీరానికి అదనపు కేలరీలను అందించేస్తుంది. చెప్పాలంటే వంద గ్రాములకు సుమారు 600 కేలరీలను పొందుతాం కాబట్టి తీసుకునేటప్పుడూ ఆ రోజు వర్కౌట్‌ల రీత్యా ఎంతమేర బెటర్ అనేది అంచనా వేసి మితంగా తీసుకుంటే మంచిది.
వేయించిన స్నాక్స్: వేయించిన అల్పాహారం అంటే అరటిపండు చిప్స్ వంటి రకరకాల ఐటెమ్స్ విషయంలో కేలరీల కంటెంట్‌పై దృష్టిపెట్టాలని చెబుతున్నారు. ఇవి బాగా రుచిగా ఉండటంతో ఒకేసారి ఎక్కువ మోతాదులో శరీరం కేలరీను ఈజీగా పొందుతుంది.
షుగర్ ఫ్రీ స్వీట్స్: షుగర్-ఫ్రీ స్వీట్స్ కదా పెద్ద క్యాలరీలు ఉండవని చాలామంద పొరపడతారు. ఇవి కొవ్వు రహితం మాత్రం కాదు. వంద గ్రాముల షుగర్ ఫ్రీ స్వీట్స్‌లో దాదాపు 317 కేలరీలు ఉంటాయని చెబుతున్నారు పోషాకాహార నిపుణురాలు ఖ్యాతి రూపానీ. అందువల్ల ఇలాంటి హెల్తీ ఆహారాలను తీసుకునే విషయంలో కాస్త జాగురకతతో వ్యవహరిస్తూ మితంగా తీసుకుంటే తక్కువ సమయంలోనే ఈజీగా బరువు తగ్గుతారని అంటున్నారు.
(చదవండి: బరువు తగ్గాలని రైస్‌కి దూరంగా ఉంటున్నారా? ఫిట్‌నెస్ కోచ్ ఏమంటున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment