ఆచార్య: సైకిల్‌ మీద సెట్స్‌కు వెళ్లిన సోనూసూద్‌ | Sonu Sood Cycling To Join Sets Of Acharya Movie Shoot | Sakshi
Sakshi News home page

ఆచార్య: సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లిన సొనూసూద్‌‌

Published Wed, Apr 14 2021 4:39 PM | Last Updated on Wed, Apr 14 2021 7:12 PM

Sonu Sood Cycling To Join Sets Of Acharya Movie Shoot - Sakshi

లాక్‌డౌన్‌లో వలస కార్మికులను స్వస్థలాలకు చేరవేసి ఎందరో పాలిట దేవుడిగా మారాడు నటుడు సోనూసూద్‌. కష్టాల్లో ఉన్న చాలామందికి ఆర్థిక సాయం చేస్తూ రియల్‌ హీరోగా పేరు గాంచాడు. ఇటీవల అల్లుడు అదుర్స్‌లో కనిపించిన సోనూసూద్‌ ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా అతడు సినిమా సెట్స్‌కు సైకిల్‌ మీద వెళ్లాడు. హైదరాబాద్‌ రోడ్ల మీద సైకిల్‌ తొక్కుకుంటూ షూటింగ్‌కు వెళ్లిన సోనూసూద్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

కాలుష్యాన్ని తగ్గించాలన్న సందేశంతో పాటు ఇలా సైక్లింగ్‌ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండొచ్చని చెప్పకనే చెప్తున్నారు హీరో సోనూసూద్‌. అతడి సింప్లిసిటీకి, ఫిట్‌నెస్‌ మీద ఉన్న శ్రద్దకు హ్యాట్సాఫ్‌ చెప్తున్నారు నెటిజన్లు. ఇక 'ఆచార్య' సినిమా విషయానికి వస్తే దీన్ని మే 13న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు సినీపండితులు.

చదవండి: కరోనా ప్రమాద ఘంటికలు: సోనూసూద్‌ స్పెషల్‌ డ్రైవ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
 
Advertisement