ఆచార్య: థియేటర్‌ వద్ద సోనూ సూద్‌ భారీ కటౌట్‌కి పాలభిషేకం | Acharya: Fans Pouring Milk On Sonu Sood Cutout At RTC X Road Sandhya Theatre | Sakshi
Sakshi News home page

Sonu Sood: ఆచార్య మూవీ థియేటర్‌ వద్ద సోనూ సూద్‌ భారీ కటౌట్‌, పాలభిషేకం​ చేసిన ఫ్యాన్స్‌

Published Sat, Apr 30 2022 3:12 PM | Last Updated on Sat, Apr 30 2022 3:27 PM

Acharya: Fans Pouring Milk On Sonu Sood Cutout At RTC X Road Sandhya Theatre - Sakshi

Fans Pouring Milk On Sonu Sood Cutout At Acharya Theatres: సోనూ సూద్‌.. పెద్దగ పరిచయం అక్కర్లేని పేరు. సినిమాలో విలన్‌గా కంటే నిజ జీవితంలో రియల్‌ హీరోగానే అందరికి తెలుసు.  కరోనా సమయంలో ఎందరో అభాగ్యులకు ఆపన్న హస్తం అందించారు. తన సొంత ఖర్చులతో ఎంతోమంది వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు చేర్చారు. అప్పటి నుంచి ఎవరూ ఏ సాయం అడిగినా కాదనకుండ తనవంతుగా చేయూతనిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఫౌండేషన్‌ పెట్టి అనారోగ్యులకు వైద్య ఖర్చులు, పెద పిల్లలకు చదువు.. ఇలా రకరకాల సామాజిక సేవలు అందిస్తున్నారు. దీంతో సోనూ సూద్‌ అందరికి రియల్‌ హీరో అయ్యారు.

చదవండి: బాలీవుడ్‌ నటి జావ్వెలిన్‌ ఫెర్నాండేజ్‌కు ఈడీ షాక్‌

ఈ నేపథ్యంలో సోనూ సూద్‌ మీద అభిమానాన్ని చాటుకున్నారు ఆయన ఫ్యాన్స్‌. ఆయన చిరంజీవి, రామ్‌ చరణ్‌ల మల్టిస్టారర్‌ ‘ఆచార్య’ మూవీలో ప్రతి కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నిన్న(ఏప్రిల్‌ 29)న విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్లో సోనూసూద్‌ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. అంతేకాదు ఆయన కటౌట్‌కి పాలభిషేకం చేసి.. పెద్ద దండ వేసి, బొట్టు పెట్టి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అంతేకాదు కటౌట్‌ ముందు టపాసులు పేలుస్తూ సందడి చేశారు. దీంతో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  మరి దీనిపై సోనూసూద్‌ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిని సంతరించుకుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement