కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఏప్రిల్ 29) ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ మూవీకి తొలిరోజు మిశ్రమ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఫస్ట్‌డే కలెక్షన్స్ కాస్త తగ్గాయి. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల గ్రాస్, 29.5 కోట్లు షేర్ సొంతం చేసుకుంది.
(చదవండి: ‘ఆచార్య’ మూవీ రివ్యూ)
నైజాంలో రూ.7.90 కోట్లు, సీడెడ్‌లో రూ.4.6 కోట్లు, ఈస్ట్‌లో రూ.2.53, వెస్ట్‌లో 2.90, గుంటూరులో 3.76, కృష్ణలో రూ.1.90, నెల్లూరులో 2.30 కోట్లను రాబట్టింది. కర్ణాటక ఇతర రాష్ట్రాలలో 1.60 కోట్లు వసూల్ చేసింది. ప్రపంచవ్వాప్తంగా 42 కోట్లు గ్రాస్, 31. కోట్లు షేర్ సాంధించింది.
ఆచార్య చిత్రానికి రూ.133 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 134 కోట్ల షేర్ రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం రూ.31.93 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.102.07 కోట్లు షేర్ ను రాబట్టాలి. మిక్స్ డ్ టాక్ తెచ్చకున్న ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మేరకు వసూళ్లను రాబడుతుందో లేదో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment