
Acharya Movie Streaming Soon On This OTT: పలు వాయిదాల అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ నేడు(ఏప్రిల్ 29) థియేటర్లోకి వచ్చింది. మల్టీస్టారర్ అంటేనే ఆ మూవీపై ఎన్నో అంచనాలు నెలకొంటాయి. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ ఒకే సినిమాలో కనిపంచడమంటే హైప్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా ఎన్నో అంచనాల మధ్య నేడు విడుదలైన ఆచార్య మూవీ బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటుంది.
చదవండి: అందుకే కాజల్ గప్‌చుప్‌గా ఉందా?
ఇప్పటికే ఈ సినిమా చూసిన పలువురు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయలను పంచుకుంటున్నారు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఓ వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇలా తొలిరోజు హౌజ్‌ఫుల్‌తో దూసుకుపోతున్న ఆచార్య మూవీ త్వరలోనే ఓటీటీలోకి కూడా సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైం సొంతం చేసుకుందట.
చదవండి: ‘ఆచార్య’ మూవీ రివ్యూ
థియేటర్లో విడులైన మూడు వారాల అనంతరం ఆచార్య ఓటీటీలోకి రానుందని సమాచారం. అంటే మే చివరి వారం నుంచి ఆచార్య ఆమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ కానుంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇందులో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో నటించగా ఆయనకు జోడిగా పూజా హెగ్డే నటించింది. ఇదిలా ఉంటే ఆచార్య కోసం 20 ఎకరాల్లో భారీ టెంపుల్ సెట్ వేసిన విషయం తెలిసిందే. దానికి ‘ధర్మస్థలి’అని నామకరణం చేశారు. సినిమాలోని సింహభాగం ఇక్కడే షూటింగ్ చేశారని డైరెక్టర్ చెప్పిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment