రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. భారీ ధరకు ఓటీటీ రైట్స్! | Mega Hero Ram Charan Game Changer Ott Rights To this Platform | Sakshi
Sakshi News home page

Game Changer Movie: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. ఆ సంస్థకే ఓటీటీ రైట్స్!

Published Tue, Mar 19 2024 9:09 PM | Last Updated on Tue, Mar 19 2024 9:25 PM

Mega Hero Ram Charan Game Changer Ott Rights To this Platform - Sakshi

మెగా హీరో, గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్‌లో ఈ మూవీ షూటింగ్‌ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ నటిస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది.  

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ విషయాన్ని తాజాగా ముంబైలో నిర్వహించిన ప్రైమ్ వీడియో ఈవెంట్‌లో వెల్లడించింది. గేమ్ ఛేంజర్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్టు ఆ ప్లాట్‍ఫామ్ ప్రకటించింది. అయితే థియేటర్లలో రిలీజ్‌ డేట్‌ ఇంకా వెల్లడించలేదు. భారీ బడ్జెట్‍తో తెరకెక్కుతున్న ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కుల కోసం భారీ మొత్తాన్ని ప్రైమ్ వీడియో వెచ్చించినట్లు టాక్ వినిపిస్తోంది. కాగా.. ఈనెల 27న రామ్‍చరణ్ పుట్టిన రోజు సందర్భంగా గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎస్‍జే సూర్య, అంజలి, జయరాం, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement