RTC Cross Road
-
Indira Park to RTC X Road : నేడు దక్షిణ భారతదేశంలోనే తొలి అతిపెద్ద స్టీల్ బ్రిడ్జి ప్రారంభం (ఫొటోలు)
-
ఆర్టీసీ క్రాస్ రోడ్డు రూట్ లో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం
-
సంధ్య థియేటర్లో సినిమా చూడటానికి వచ్చిన చిరంజీవి కూతుళ్లు
మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా వచ్చేసింది. చిరంజీవి నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా నేడు(శుక్రవారం)గ్రాండ్‌గా విడుదల అయ్యింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అర్థరాత్రి నుంచే ప్రీమియర్ షోలతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. డప్పులు, డ్యాన్సులతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాడ్ రోడ్డులోని సంథ్య థియేటర్ వద్ద తెల్లవారుజామున 4గంటలకే సినిమా షో పడింది. ఈ థియేటర్లో డైరెక్టర్ బాబీ, దేవీ శ్రీ ప్రసాద్‌లతో పాటు చిరంజీవి కూతుళ్లు సుష్మిత, శ్రీజలు వచ్చారు. అభిమానులతో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
ఆచార్య: థియేటర్ వద్ద సోనూ సూద్ భారీ కటౌట్‌కి పాలభిషేకం
Fans Pouring Milk On Sonu Sood Cutout At Acharya Theatres: సోనూ సూద్.. పెద్దగ పరిచయం అక్కర్లేని పేరు. సినిమాలో విలన్‌గా కంటే నిజ జీవితంలో రియల్ హీరోగానే అందరికి తెలుసు. కరోనా సమయంలో ఎందరో అభాగ్యులకు ఆపన్న హస్తం అందించారు. తన సొంత ఖర్చులతో ఎంతోమంది వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు చేర్చారు. అప్పటి నుంచి ఎవరూ ఏ సాయం అడిగినా కాదనకుండ తనవంతుగా చేయూతనిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఫౌండేషన్ పెట్టి అనారోగ్యులకు వైద్య ఖర్చులు, పెద పిల్లలకు చదువు.. ఇలా రకరకాల సామాజిక సేవలు అందిస్తున్నారు. దీంతో సోనూ సూద్ అందరికి రియల్ హీరో అయ్యారు. చదవండి: బాలీవుడ్ నటి జావ్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ఈడీ షాక్ ఈ నేపథ్యంలో సోనూ సూద్ మీద అభిమానాన్ని చాటుకున్నారు ఆయన ఫ్యాన్స్. ఆయన చిరంజీవి, రామ్ చరణ్‌ల మల్టిస్టారర్ ‘ఆచార్య’ మూవీలో ప్రతి కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నిన్న(ఏప్రిల్ 29)న విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్లో సోనూసూద్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. అంతేకాదు ఆయన కటౌట్‌కి పాలభిషేకం చేసి.. పెద్ద దండ వేసి, బొట్టు పెట్టి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అంతేకాదు కటౌట్ ముందు టపాసులు పేలుస్తూ సందడి చేశారు. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి దీనిపై సోనూసూద్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిని సంతరించుకుంది. The #SonuSood Phenomenon continues as the fans pour their love on the real hero once again! Such feat is rarely achieved by few super stars! @SonuSood pic.twitter.com/1hNurkpZR7 — Harish Kumar (@apparalaharishk) April 30, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1701356058.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
ముషీరాబాద్: నాలాల సమగ్ర అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ)తో వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీఎస్టీ రోడ్డులోని నాగమయ్యకుంట వద్ద, నల్లకుంట కూరగాయల మార్కెట్ రోడ్డులో హెరిటేజ్ బిల్డింగ్ వద్ద రూ.12 కోట్ల వ్యయంతో బ్రిడ్జిల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా రెండు బ్రిడ్జిల నిర్మాణ పనులను హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, కార్పొరేటర్ సి.సునిత ప్రకాష్‌గౌడ్‌లతో కలిసి మంత్రి తలసాని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఏటా వర్షాకాలంలో నాగమయ్యకుంట, సాయిచరణ్ కాలనీ, పద్మాకాలనీ, అచ్చయ్యనగర్ తదితర కాలనీలు ముంపునకు గురై ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. సమస్యకు ప్రధాన కారణమైన ఇరుకు బ్రిడ్జిలను తొలగించి ఆ స్థానంలో విశాలమైన బ్రిడ్జిలు నిరి్మస్తున్నట్లు తెలిపారు. పనులు పూర్తయితే ఈ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 8వేల కుటుంబాలకు ఉపశమనం లభిస్తుందన్నారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో రూ.6వేల 700 కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. స్టీల్ బ్రిడ్జితో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.. హుస్సేన్‌సాగర్ నుంచి అంబర్‌పేట మీదుగా మూసీ వరకు ఉన్న హుస్సేన్‌సాగర్ నాలాకు 2020లో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద రావడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయని మంత్రి తలసాని వెల్లడించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని నాలాకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిరి్మంచడానికి పూనుకున్నట్లు తెలిపారు. ఇందిరాపార్కు నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా వీఎస్టీ వరకు రూ.426 కోట్లతో చేపట్టిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సీఈ కిషన్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్, డీఎంసీ హరికృష్ణ, వాటర్ వర్క్స్ జీఎం సుబ్బారాయుడు, టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెన్ శ్రీనివాస్‌రావు, ముఠా జైసింహా, మాజీ కార్పొరేటర్ బి.హేమలత, బి.శ్రీనివాస్‌రెడ్డి, కె.మాధవ్ తదితరులు పాల్గొన్నారు. బ్రిడ్జి పనులను ప్రారంభిస్తున్న మంత్రులు తలసాని, మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ సునీత తదితరులు -
సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ ఫ్యామిలీ సందడి
Allu Arjun And Family Visits RTC X Road Sandhya Theater: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప మూవీ నేడు(డిసెంబర్ 17) విడుదలైన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప రిలీజ్ అయిన థియేటర్లో బన్నీ ఫ్యాన్స్ తగ్గేదే లే అన్నట్టుగా హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఓ థియేటర్లో బన్నీ ఫ్యామిలీతో కలిసి సందడి చేశాడు. పుష్ప మూవీ చూసేందుకు భార్య స్నేహారెడ్డి, కుమారుడు అయాన్‌తో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్‌కు వచ్చారు అల్లు అర్జున్. అక్కడ బన్నీని చూడగానే ఫ్యాన్స్ అంతా మరింత రచ్చ చేశారు. చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం నో ఆఫర్స్, అయినా తగ్గని క్రేజ్.. బన్నీతో సెల్ఫీ దిగేందుకు అభిమానులంతా ఎగబడ్డారు. అల్లు అర్జున్‌పై పూలు చల్లుతూ ‘తగ్గేదే లే’ అంటూ అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలో థియేటర్లోకి వెళ్లేందుకు బన్నీ ఫ్యామిలీ కాస్తా ఇబ్బంది పడింది. ఇక వారి రాకతో అక్కడ మరింత సందడి వాతావరణం నెలకొంది. అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే థియేటర్లకు అడ్డా.. ఏ సినిమాను చూడాలన్నా… గొంతుచించుకుని అరవాలన్నా… హంగామా చేయాలన్నా అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆర్టీసీ క్రాస్ రోడ్డుయే. అందుకే అక్కడి థియేటర్లలో ఏ సినిమా రిలీజైనా… ఆ సినిమా హీరో వచ్చి ఫ్యాన్స్ రెస్పాన్స్‌ను చూస్తుంటారు. సినిమా ఎలా ఉందో తెలుసుకుంటారు. చదవండి: ‘పుష్ప’మూవీ రివ్యూ -
ఆర్టీసీ క్రాస్ రోడ్ బావార్చి హోటల్ సీజ్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఆర్టీస్ క్రాస్ రోడ్డు బావార్చి హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్ యంత్రాన్ని పెట్టుకోవాలని హోటల్ యజమాన్యానికి పలుమార్లు సూచించినా పట్టించుకోలేదని, గతేడాది నవంబర్ 25న నోటీసులు కూడా ఇచ్చామని ముషీరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఉమా ప్రకాష్ మీడియాకు తెలిపారు. డిసెంబర్ 25కే నోటీసు సమయం గడిచినా హోటల్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీంతో ఈ రోజు హోటల్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. తడి, పొడి చెత్తను వేరుచేయడంలేదని, జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా హోటళ్ల నిర్వాహకులు వ్యర్థపదార్థాలను మ్యాన్ హోల్లోకి వదులుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక హోటల్‌ను సీజ్ చేయవద్దంటూ.. జీహెచ్ఎంసీ అధికారులతో బావార్చి యాజమాన్యం వాగ్వాదానికి దిగింది. -
‘సంధ్య’లో సూర్య
ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్లో శుక్రవారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఇక్కడ ప్రదర్శిస్తున్న‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’ సినిమాను భార్య స్నేహారెడ్డి, కుటుంబ సభ్యులు, చిత్ర యూనిట్‌తో కలిసిప్రేక్షకుల మధ్య వీక్షించారు. అర్జున్‌తో కరచాలనం చేసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. ముషీరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్లో హీరోఅల్లు అర్జున్ సందడి చేశారు. ఆయన నటించిన ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ మూవీని భార్య స్నేహారెడ్డి, చిత్రయూనిట్సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం వీక్షించారు.స్టైలిష్ స్టార్‌ను చూసేందుకు అభిమానులు తరలొచ్చారు. -
నకిలీ బిచ్చగాళ్లపై క్రిమినల్ కేసులు
- నగర మేయర్ బొంతు రామ్మోహన్ చిక్కడపల్లి: నకిలీ బిచ్చగాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు వెనుకాడేదిలేదని నగర మేయర్ బొంతు రామ్మోహన్ హెచ్చరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీవోస్ ఫర్ బెగ్గర్ ఫ్రీ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో యాచకులు లేని నగరంగా హైదరాబాద్‌ను చీర్చిదిద్దాలని ఫ్లకార్డు, బ్యానర్లు పట్టుకొని ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ నిజమైన యాచకులకు ఉపాధి కల్పించి, వారి జీవన స్థితిగతులను మెరుగు పర్చేందుకు కృషిచేస్తామని తెలిపారు. నగరంలో 10వేల మంది బిచ్చగాళ్లు ఉండగా కేవలం 400మంది మాత్రమే నిజమైన యాచకులుగా సర్వేలో తేలిందని, నకిలీలంతా నగరాన్ని వదిలిపెట్టి వెళ్లకపోతే కేసులు తప్పవన్నారు. కార్యక్రమంలో స్థానిక గాంధీనగర్, హిమాయత్‌నగర్ కార్పొరేటర్లు ముఠా పద్మ, హేమలత, టీఆర్ఎస్ నాయకులు, కార్యక్రమ నిర్వాహక సంస్థ వ్యవస్థాపకులు శంకర్‌నారాయణ, చైర్మన్ జి.రామయ్య, నిర్వాహక కార్యదర్శి రాములు తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగుల జాతరలో కోచింగ్‌ల ‘కత్తెర్లు’
-
నిరుద్యోగుల జాతరలో కోచింగ్‌ల ‘కత్తెర్లు’
శిక్షణార్థులను లూటీ చేస్తున్న కోచింగ్ సెంటర్లు సర్కారీ కొలువుల కోసం లక్షల మంది ఎదురుచూపు హైదరాబాద్‌కు చేరి కోచింగ్ సెంటర్లలో తర్ఫీదు సిలబస్ మార్పులు ఖరారు కాకున్నా పుస్తకాలతో కుస్తీ నోటిఫికేషన్ల జారీపై ఇంకా లేని స్పష్టత సిలబస్‌నే నిర్ణయించని సర్కారు.. నిరుద్యోగుల్లో ఆందోళన శిక్షణ కేంద్రాలపై నియంత్రణ కరువు.. నిబంధనలు బేఖాతర్ ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు.. అప్పులపాలవుతున్న యువత సాక్షి, హైదరాబాద్: సర్కారీ కొలువుల కోసం నిరుద్యోగులు పట్నం బాట పట్టారు. ఉద్యోగ ప్రకటనలు రాకముందే రాజధానికి చేరుకుని కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు. కొత్త రాష్ట్రంలో వేలాది ఖాళీ పోస్టులను భర్తీ చేస్తారన్న ప్రచారంతో కనీసం నాలుగైదు లక్షల మంది నిరుద్యోగులు హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు. మరెంతో మంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. నగరంలోని అశోక్‌నగర్, గాంధీనగర్, దోమల్‌గూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, దిల్సుఖ్నగర్, కొత్తపేట, మలక్‌పేట, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా నిరుద్యోగులే. అసలు ఉద్యోగమే లేని వారిని పక్కనబెడితే.. ప్రైవేటు ఉద్యోగాలకు సెలవులు పెట్టి కొందరు, ఉద్యోగాలనే వదిలేసి మరికొందరు, కింది స్థాయి ప్రభు త్వ ఉద్యోగాల్లోని వారు కూడా ఉన్నత ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్నారు. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియకపోయినా, పోటీ పరీక్షల సిలబస్ కూ డా ఖరారు చేయకపోయినా శిక్షణ కేంద్రాలకు నిరుద్యోగుల రాక కొనసాగుతూనే ఉంది. దీంతో రాజధానిలో ఏ మూలన చూసినా హాస్టళ్లు కిటకిటలాడుతున్నాయి. ఉద్యోగాలు వదిలేసి.. అప్పులు చేస్తూ.. గ్రూపు-1, గ్రూపు-2 వంటి ఉన్నత స్థాయి పోస్టుల కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలను పక్కనబెట్టి మరీ అనేక మంది సిద్ధమవుతున్నారు. కోచింగ్ ఫీజులు, రూమ్ అద్దెలు, భోజనం, వసతి, పుస్తకాల కోసం ఏడాది కాలంలో ఒక్కొక్కరు సగటున రూ.84 వేలకుపైగా వెచ్చిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక మంది అప్పులు చేసి మరీ శిక్షణ పొందుతున్నారు. సిలబస్ లేకుండా సన్నద్ధమయ్యేదెలా? మరోవైపు పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులను రాష్ర్ట ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. సిలబస్‌లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సామాజిక స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక పరిస్థితులు, 1948 నుంచి మొదలుకొని 2014 వరకు తెలంగాణ ఉద్యమ చరిత్ర తదితర మార్పులు ఉంటాయని టీఎస్పీఎస్సీ ఇప్పటికే పేర్కొంది. కాని పూర్తిస్థాయి సిలబస్ ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాక రాత పరీక్ష నిర్వహణకు రెండు నెలలకు మించి సమయం ఉండదు. అలాంటపుడు సిలబస్ ఏంటో తెలియకుండా పరీక్షకు తామెలా సన్నద్ధం కావాలని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయి సిలబస్‌ను ముందుగా ప్రకటించకున్నా శిక్షణ తీసుకోకుండా వారు ఉండలేకపోతున్నారు. ఇష్టారాజ్యంగా కోచింగ్ సెంటర్లు కోచింగ్ కేంద్రాల్లో కనీస నిబంధనలు, ప్రమాణాలు పాటించకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాత షాపింగ్ మాల్స్, ఫంక్షన్‌హాళ్లు, కాలేజీలు, స్కూళ్ల ఆడిటోరియాల్లోనూ శిక్షణ కేంద్రాల పేరుతో బహిరంగ సభలనుతలపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఒక్కో బ్యాచ్‌లో 700 నుంచి వెయ్యి మందికి శిక్షణ ఇస్తున్నారు. కనీస పర్యవేక్షణ కూడా లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బదులు తెలంగాణకు సంబంధించిన అంశాలు చదువుకుంటే సరిపోతుందని చెబుతూ శిక్షణ కొనసాగిస్తున్నారు. ఇష్టారాజ్యంగా ఫీజులను నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం-1982 ప్రకారం ఈ కోచింగ్ సెంటర్లను ప్రభుత్వం నియంత్రించవచ్చు. ఇందుకు సంబంధించిన 1997 నాటి జీవో 200ను పాలకులు పట్టించుకోవడం లేదు. జీవోలో మార్గదర్శకాలు స్పష్టంగా లేవని పక్కన పడేశారు. రాజధానిలో కోచింగ్ కేంద్రాలు అశోక్‌నగర్ పరిసరాల్లో: 80కి పైనే దోమల్‌గూడ పరిసరాల్లో: 20కి పైనే చిక్కడపల్లి పరిసరాల్లో: 25కు పైనే దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, అమీర్‌పేట్ పరిసరాల్లో: 250కి పైనే ఏడాదిగా శిక్షణ పొందుతున్న వారు: లక్ష మందిపైగా శిక్షణ పూర్తయి సిద్ధమవుతున్న వారు: 2లక్షలకు పైనే మూడు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వారు: మరో లక్షకుపైగా. గ్రూపు-1 కోసమే మూడేళ్లుగా.. గ్రూపు-1 కోసమే మూడేళ్లుగా సిద్ధమవుతున్నాను. ఇప్పు డు పరీక్షల విధానం, సిలబస్‌లో మార్పులంటున్నారు. మరి త్వరగా సిలబస్‌ను ప్రకటిస్తే సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది కదా? నోటిఫికేషన్లోనే సిలబస్‌ను ప్రకటిస్తే కష్టం. ప్రిపేర్ అయ్యేందుకు సమయం par సరిపోదు. - గుమ్మడి అనురాధ, ఇల్లెందు ప్రైవేటు ఉద్యోగం వదులుకున్నా.. గ్రూపు-1 రాసి డీఎస్పీ కావాలన్నది నా లక్ష్యం. 2013లో ఎంటెక్ పూర్తయింది. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్లు చేశాను. తెలంగాణ రాష్ట్రం రావడంతో నోటిఫికేషన్లు వస్తాయన్న ఆశతో గతేడాది ఉద్యోగం మానేసి కోచింగ్ తీసుకుంటున్నాను. - బి. తిరుపతి, మహబూబ్‌నగర్ ఇప్పటికే రెండున్నర లక్షల అప్పు గ్రూప్-2 కోచింగ్ కోసం వరంగల్ నుంచి వచ్చాను. అశోక్‌నగర్‌లో రూం తీసుకొని చదువుతున్నా. గ్రూపు-2 అధికారి కావాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు అప్పు రెండున్నర లక్షలైంది. - ఎ. సురేష్, గ్రూప్-2 అభ్యర్థి -
రామోజీరావుకు తొత్తులా..?
కార్మికశాఖ అధికారులపై ఫిల్మ్‌సిటీ కార్మికుల ఆగ్రహం తమకు వ్యతిరేకంగా యాజమాన్యం తెచ్చుకున్న స్టే ఎత్తివేయించాలని ధర్నా సాక్షి,హైదరాబాద్: కార్మికులకు,కార్మికశాఖకు వ్యతిరేకంగా రామోజీ ఫిల్మ్‌సిటీ యాజమాన్యం తెచ్చుకున్న స్టేను ఎత్తివేయించడంలో కార్మికశాఖ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రామోజీ ఫిల్మ్‌సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం ఆర్టీసీ క్రాస్‌రోడ్డు సమీపంలోని కార్మికశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఫిల్మ్‌సిటీ యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ సలహాదారు ఎం.బాబ్జి, వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యం, ప్రధానకార్యదర్శి జి.సైదులు మాట్లాడుతూ..హక్కుల పరిరక్షణకు సంబంధించి రామోజీ ఫిల్మ్‌సిటీ కార్మికుల వివాదాన్ని అప్పటి జాయింట్లేబర్ కమిషనర్ మురళీసాగర్ లేబర్‌కోర్టు-1 కు పంపించగా, కోర్టు దాన్ని పారిశ్రామిక వివాదం 43/2012గా నమోదు చేసిందని చెప్పారు. దీనిపై రామోజీ యాజమాన్యం హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్‌ను కొట్టివేశారని వెల్లడించారు. యాజమాన్యం మళ్లీ 2013 ఫిబ్రవరి 4న హైకోర్టులో పిటిషన్ వేయగా, న్యాయమూర్తులు ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ.. ఐడీ 43/2012 ప్రొసీడింగ్స్‌పై స్టే విధించారన్నారు. అయితే ఏడాదవుతున్నా కార్మికశాఖ తరపున కోర్టులో కౌంటరు దాఖలు చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మికశాఖ అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు ఫిల్మ్‌సిటీ యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తూ స్టేఎత్తివేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. రామోజీ ఫిల్మ్‌సిటీ యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేకవిధానాలతో విసిగిపోయి 2008 యూనియన్ పెట్టుకున్నట్లు గుర్తుచేశారు. వేతనాల పెంపు, ఉద్యోగభద్రత తదితర న్యాయమైన డిమాండ్ల సాధనకు నోటీసిస్తే పరిష్కరించాల్సిన యాజమాన్యం..కార్మికులపై కక్షసాధింపునకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధర్నా అనంతరం యూనియన్ ప్రతినిధులు రంగారెడ్డి జిల్లా జేసీఎల్ అజయ్‌ను కలిసి రామోజీ ఫిల్మ్‌సిటీ యాజమాన్యం తెచ్చుకున్న స్టేను వెకేట్ చేయించేందుకు సత్వరమే కౌంటర్ దాఖలు చేయాలని వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నర్సింహారావు, పీవీఎస్ నాయుడు, కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, యాదగిరి, మహేందర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.