సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పుష్స-2 సినిమా విడుదల సందర్బంగా చనిపోయిన మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ థియేటర్ ఎదుట డీవైఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నేతలు ధర్నాకు దిగారు.
వివరాల ప్రకారం.. ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా ప్రీమియర్ షోలో భాగంగా సంధ్య థియేటర్ వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో సదరు మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని థియేటర్ ఎదుట డీవైఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నేతలు ధర్నాకు దిగారు. దీంతో, వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఇదిలా ఉండగా.. రేవతి మృతిపై తాజాగా అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ఇది నిజంగా దురదృష్టకరమని తెలిపింది. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తమ బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని చెప్పుకొచ్చింది. మరోవైపు.. మహిళ మృతి విషయం పట్ల పోలీసులు సైతం సీరియస్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment