![GHMC officials Seizes RTC X Road Bawarchi Hotel - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/7/Bawarchi.jpg.webp?itok=3Xw7DTBi)
ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావార్చి హోటల్ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఆర్టీస్ క్రాస్ రోడ్డు బావార్చి హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్ యంత్రాన్ని పెట్టుకోవాలని హోటల్ యజమాన్యానికి పలుమార్లు సూచించినా పట్టించుకోలేదని, గతేడాది నవంబర్ 25న నోటీసులు కూడా ఇచ్చామని ముషీరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఉమా ప్రకాష్ మీడియాకు తెలిపారు.
డిసెంబర్ 25కే నోటీసు సమయం గడిచినా హోటల్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీంతో ఈ రోజు హోటల్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. తడి, పొడి చెత్తను వేరుచేయడంలేదని, జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా హోటళ్ల నిర్వాహకులు వ్యర్థపదార్థాలను మ్యాన్ హోల్‌లోకి వదులుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక హోటల్‌ను సీజ్ చేయవద్దంటూ.. జీహెచ్‌ఎంసీ అధికారులతో బావార్చి యాజమాన్యం వాగ్వాదానికి దిగింది.
Comments
Please login to add a commentAdd a comment