Bawarchi hotel
-
ఛీ..ఛీ.! బావర్చి.. బిర్యానీలో ఏముందో చూడండి
-
Bawarchi Biryani: చికెన్ బిర్యానీలో టాబ్లెట్లు
-
బావర్చిలో సిగరెట్ బిర్యానీ.. కస్టమర్ సర్ ప్రైజ్
-
వెయిటర్ నిర్వాకం.. టిప్పు ఇవ్వలేదని యువకులపై దాడి
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లో ఒక వెయిటర్ కస్టమర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. టిప్పు ఇవ్వలేదన్న కోపంతో యువకులపై దాడికి తెగబడ్డాడు. శంషాబాద్ పరిధినిలోని ఎయిర్పోర్ట్ బావర్చీ హోటల్లో స్థానికంగా కొంత మంది యువకులు నిన్న(మంగళవారం) రాత్రి బిర్యానీ తినడానికి వచ్చారు. ఆ తర్వాత.. యువకులు బిల్లు చెల్లించి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో.. వెయిటర్ టిప్పు చెల్లించరా.. అంటూ వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత హోటల్ సిబ్బందితో కలిసి యువకులపై దాడికి తెగబడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువకులను సముదాయించి హోటల్ నుంచి పంపించి వేశారు. గతంలోను ఇదే హోటల్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు బావార్చి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకొవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. యువకులు వెయిటర్‌పై స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వెయిటర్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
బావర్చీ బిర్యానీ తినాలనీ ఉందా?
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): బావర్చీ బిర్యానీ తినాలనీ ఉందా? ఫుడ్‌ను ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మరో వారం రోజులు నిరీక్షించాల్సిందే. ఈ నెల 8 నుంచి హోటళ్లు తెరుచుకున్నా.. ఫుడ్ ఆర్డర్‌కు మాత్రం జర.. వెయిట్ ప్లీజ్ అంటూ సమాధానం వచ్చే అవకాశాలు లేకపోలేదు. కరోనా లాక్డౌన్ నుంచి హోటల్ రంగానికి మినహాయింపు లభించినా.. పూర్తిస్థాయిలో సర్వీస్ అందించే అవకాశాలు కనిపించడం లేదు. లాక్డౌన్లో హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర అతిథ్య సేవారంగాలకు ఈ నెల 8 నుంచి మినహాయిస్తూ కేంద్రం గ్రీన్ సిగ్న్‌ల్ ఇచ్చినా.. హోటళ్లలో వంటావార్పు చేసే చెఫ్ నుంచి వెయిటర్ వరకు, మేనేజర్ల నుంచి సర్వీస్ బాయ్స్ వరకు అందుబాటులో లేకుండాపోయారు. ఒకవైపు సిబ్బంది కొరత వెంటాడుతుండగా.. మరోవైపు ఇప్పటికే విద్యుత్ బిల్లులు, టాక్స్‌లు, నిర్వహణ భారం తడిసి మోపెడు కావడంతో ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. వ్యాపారం పునఃప్రారంభించినా కరోనా భయంతో కస్టమర్స్ వస్తారనే భరోసా లేకుండాపోయింది. దీంతో హోటల్స్, రెస్టారెంట్లను నడిపేదెలా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. హోటల్ రంగం కుదేల్.. లాక్‌డౌన్‌తో హైదరాబాద్ మహానగరంలో హోటల్ రంగం కుదేలైంది. పర్యాటక రంగాన్ని పడకేసేలా చేసింది. ఫలితంగా హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిజం రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ హోటళ్లు మూతపడ్డాయి. రెస్టారెంట్లు బంద్ అయ్యాయి. హోటల్ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ సుమారు సుమారు రెండు లక్షల మంది ఉద్యోగ, ఉపాధికి ముప్పు వాటిల్లింది. హోటల్స్, రెస్టారెంట్ల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. వంట మాస్టర్స్ నుంచి క్లీనర్లు, బేరర్ల వరకు ఒక్కో రెస్టారెంట్లో సగటును 30 మందికి తగ్గకుండా పని చేసేవారు. లీజు తీసుకుంటే మాత్రం నెలకు కనిష్టంగా రూ.2లక్షల అద్దె చెల్లించాల్సిందే. వంటశాలలో గ్రైండర్లు, హీటర్లు, గ్రీజర్ల మోతలు సరేసరి. రెస్టారెంట్లోనూ ఏసీలు, ఫ్యాన్లు ఉండాల్సిందే. విద్యుత్ చార్జీలు కమర్షియల్ టారీఫ్‌లో గూబ గుయ్యిమనిపిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ తర్వాత తిరిగి రెస్టారెంట్లు కొనసాగేదెలా తెలియని పరిస్థితి నెలకొంది. హోటల్స్ పరిస్థితి కూడా రెస్టారెంట్లకు భిన్నంగా ఏమీ లేదు. లక్ష మందికిపైనే.. గ్రేటర్ హైదరాబాద్‌లోని హోటల్స్, రెస్టారెంట్లు, స్టార్ హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌లో షెఫ్స్, కుక్స్, హెల్పర్స్, సప్లయర్స్‌గా సుమారు లక్ష మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో 70 శాతం వరకు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అసోం, మణిపూర్, ఒడిశా, మేఘాలయ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. మిగిలిన 30 శాతమే స్థానికులు. లాక్‌డౌన్‌తో హోటల్ రంగం సిబ్బంది దాదాపు సుమారు 70 శాతం వరకు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇప్పట్లో కూడా వచ్చే అవకాశాలు కానరావడం లేదు. ఇక స్టార్ హోటల్స్ సిబ్బందికి ఎలాంటి జీతాలు చెల్లించకపోగా, మే మాసంలో ఏకంగా నోటీసులు జారీ చేసి జీతాలు లేకుండా ఆగస్ట్ 31 వరకు సెలవుల్లో ఉండాలను ఆదేశించినట్లు తెలుస్తోంది. ధీమా కరువే.. లాక్డౌన్ మినహాయింపుతో హోటల్స్, రెస్టారెంట్స్, అతిథ్య రంగం వ్యాపారం పునః ప్రారంభించినా..వ్యాపారం జరుగుతుందనే గ్యారంటీ లేదన్న భావన నిర్వాహకులు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్‌తో ఉపాధి లేకపోవడం, ప్రైవేటు ఉద్యోగులకు జీతాలు లేకపోవడం, ఉద్యోగంపై భరోసా లేకపోవడం తదితర కారణాలతో ప్రజల్లో కొనుగోలు శక్తిని తీవ్రంగా దెబ్బతీస్తాయని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు వీకెండ్స్ పేరుతో బయటకు వెళ్లడం, ఎంజాయ్ చేయడం వంటి వాటికి స్వస్తి చెప్పేస్తారని వ్యాపారులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ భయంతో పాటు ఇప్పట్లో ఎవరూ ఇల్లు కదిలే అవకాశం ఉండకపోవచ్చన్న భావన వ్యక్తమవుతోంది. దీంతో హోటళ్లను తిరిగి తెరిచినా వ్యాపారులు నిర్వహణ ఖర్చులను భారీగా తగ్గించుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ టెక్ అవేపైనా ప్రభావం.. నగరంలో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్పైనా కరోనా ఎఫెక్ట్ పడింది. లాక్డౌన్లో ఆన్లైన్, టెక్ అవే ఫుడ్స్‌కు మినహాయింపు ఇచ్చినా.. వ్యాపారం మాత్రం పెద్దగా ముందుకు సాగడం లేదు. 12 గంటల్లో ఫుడ్ డెలివరీ బాయ్స్ 25 నుంచి 40 వరకు ఆర్డర్లు దొరికేవి. ఇప్పుడా సంఖ్య 2 నుంచి 5కు మించడం లేదనే ఆవేదన వ్యక్తవుతోంది. టెక్ అవే గిరాకీ కూడా పూర్తిగా ఐదు శాతానికి పడిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి లాక్‌డౌన్‌తో ఆర్థికంగా దెబ్బతిన్న హోటల్ రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తాజా మినహాయింపుతో హోటళ్లను తెరిచినా అతిథుల రాక పెద్దగా ఉండకపోవచ్చు. జనం కొన్నాళ్లపాటు భయపడి ఇంట్లోనే ఉండిపోతారు. దీంతో బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకు వాయిదాలు కట్టే పరిస్థితి కూడా హోటల్ నిర్వాహకులకు ఉండదు. కనీసం ఏడాది పాటు జీఎస్టీ రద్దు చేయాలి. విద్యుత్ చార్జీల్లో రాయితీలు కల్పించాలి. – ఎస్ వెంకట్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
హోటళ్లపై బల్దియా కొరడా
నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిపి కొన్నింటిని సీజ్ చేశారు. మరికొన్నింటికి భారీగా జరిమానాలువిధించారు. సాక్షి, సిటీబ్యూరో: బల్క్ గార్బేజ్‌ను ఉత్పత్తి చేస్తూ పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కంపోస్ట్ ఎరువుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయని ముషీరాబాద్‌లోని బావర్చీ హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. దీంతో పాటు కూకట్పల్లి సర్కిల్ నిజాంపేట్‌లోని సహారా కేఫ్ రెస్టారెంట్లో అపరిశుభ్రంగా కిచెన్ నిర్వహించడంతో సీజ్ చేశారు. వ్యర్థాలను డ్రైనేజీలో వేయడం, సిల్ట్ చాంబర్లను నిర్మించుకోకపోవడంతో త్రిపురా బార్ అండ్ రెస్టారెంట్‌కు రూ.20వేల జరిమానాను విధించారు. మూసాపేట సర్కిల్లోని దేవి గ్రాండ్ హోటల్లో అపరిశుభ్ర వాతావరణం, ధ్రువీకరించని మాంసం ఉపయోగించడం, డ్రైనేజీలో వ్యర్థాలను వేయడం తదితర కారణాలతో రూ. 30,100 జరిమానాగా విధించారు. వ్యర్థపదార్థాల నిర్వహణ చట్టం అనుసరించి 50కిలోలకుపైగా వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారు తప్పనిసరిగా కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి. 50 కిలోలకు బదులుగా వంద కిలోల వ్యర్థాలను ఉత్పత్తిచేసే హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్లు విధిగా కంపోస్ట్ ఎరువుల తయారీ యూనిట్లను డిసెంబర్ 25లోపు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్లు, కళ్యాణమండపాలు, బాంకెట్ హాళ్లకు ఇప్పటికే పలుమార్లు నగరమేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ ఎం.దానకిషోర్‌లు నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్ల యజమానులతో సమావేశాలు నిర్వహించారు. ఈ విషయమై కంపోస్ట్ యూనిట్లను ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న బడా హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద గతంలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది గాంధీగిరీ కూడా నిర్వహించారు. మార్కెట్లో లభ్యమయ్యే కంపోస్ట్ ఎరువుల తయారీ యంత్రాల ధరలు, అవి దొరికే ప్రాంతాలు, విక్రయించే సంస్థల వివరాలను జీహెచ్ఎంసీ వెబ్సైట్లో ప్రదర్శించడంతో పాటు ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసింది. -
ఆర్టీసీ క్రాస్ రోడ్ బావార్చి హోటల్ సీజ్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఆర్టీస్ క్రాస్ రోడ్డు బావార్చి హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్ యంత్రాన్ని పెట్టుకోవాలని హోటల్ యజమాన్యానికి పలుమార్లు సూచించినా పట్టించుకోలేదని, గతేడాది నవంబర్ 25న నోటీసులు కూడా ఇచ్చామని ముషీరాబాద్ డిప్యూటీ కమిషనర్ ఉమా ప్రకాష్ మీడియాకు తెలిపారు. డిసెంబర్ 25కే నోటీసు సమయం గడిచినా హోటల్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీంతో ఈ రోజు హోటల్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. తడి, పొడి చెత్తను వేరుచేయడంలేదని, జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా హోటళ్ల నిర్వాహకులు వ్యర్థపదార్థాలను మ్యాన్ హోల్లోకి వదులుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక హోటల్‌ను సీజ్ చేయవద్దంటూ.. జీహెచ్ఎంసీ అధికారులతో బావార్చి యాజమాన్యం వాగ్వాదానికి దిగింది. -
బిల్డింగ్‌పై నుంచి దూకుతూ, చేతికి చిక్కినా..
సాక్షి, రంగారెడ్డి : శంషాబాద్ సమీపంలోని బావర్చీ హోటల్ బిల్డింగ్ పై నుంచి దూకుతానంటూ ఓ వ్యక్తి హంగామా సృష్టించాడు. శుక్రవారం రాత్రి అతన్ని ఓ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. స్టేషన్ నుంచి తప్పించుకున్న ఆ వ్యక్తి సమీపంలోని బావర్చీ హోటల్ మూడో అంతస్తు పైకెక్కి ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. స్థానికుల సమాచారంలో అక్కడి చేరుకున్న పోలీసులు.. అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ అతను ఎవరి మాట వినలేదు. పోలీసులు దగ్గరకు రావడం చూసి బిల్డింగ్ పైనుంచి దూకేశాడు. వెంటనే పోలీసులు అతని చెయ్యి పట్టుకుని పైకి లాగేందుకు ప్రయత్నించారు. ఎంత కాపాడాలని ప్రయత్నించినా... అతడు మాత్రం వినకుండా కాళ్లు అటూ ఇటూ ఆడిస్తూ దూకడానికి ప్రయత్నించిన తీరు అక్కడున్న వారందరికి ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. చివరకు పోలీసుల చేతులను విడిపించుకొని దూకినా, కిందనే ఉన్న మొదటి అంతస్తులో పడిపోయాడు. అప్పటికే కింద ఉన్న కొంతమంది పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో అతనికి స్వల్పగాయాలు అయినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తికి మతిస్థితిమితం సరిగా లేదని పోలీసులు అంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘బావర్చి’ లో పేకాట.. హోటల్ సీజ్!
హయాత్‌నగర్: పేకాటరాయుళ్లపై పోలీసులు కొరడా ఝళిపించారు. రహస్యంగా పేకాట ఆడుతూ జల్సా చేస్తున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. నగర శివార్లలోని హయత్‌నగర్‌లో ఉన్న ‘బావర్చి’ హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు గురువారం రట్టు చేశారు. పేకాట ఆడుతున్న 16మందిని అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి రూ. 2.37 లక్షల నగదుతో పాటు 17 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని ’బావర్చి’ హోటల్లో రహస్యంగా పేకాట తంతు కొనసాగుతోంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ గుట్టును రట్టు చేసినట్టు తెలుస్తోంది. పేకాట బాగోతం నేపథ్యంలో ’బావర్చి’ హోటల్‌ను సీజ్ చేయాలని పోలీసులు రెవెన్యూ అధికారులకు నివేదించారు. -
‘బావర్చి హోటల్’ సీజ్
► మునిసిపల్ అధికారుల దాడి ► పరిశుభ్రత లోపించడంతో మూసివేత బోడుప్పల్: పరిశుభ్రత పట్టని ఓ హోటల్‌ను పీర్జాదిగూడ మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఉప్పల్ డిపో వద్ద ఉన్న బావర్చి హోటల్‌పై మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి, శానిటరీ అధికారులు కలిసి బుధవారం ఆకస్మిక దాడి నిర్వహించారు. వివరాలు.. బావర్చి హోటల్ వెనుక వైపు గల మ్యాన్‌హోల్ నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోందని స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం మున్సిపల్ కమిషనర్, శానిటరీ అధికారులు బావర్చి హోటల్ వెనుక ఉన్న మ్యాన్‌హోల్‌ను పరిశీలించగా మురుగునీరు, చెత్తా చెదారంతో నిండిపోయి ఉంది. అధికారులు సదరు హోటల్లోని కిచెన్‌ను పరిశీలించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉంది. ప్లాస్టిక్ డబ్బాల్లో కుళ్లిపోయిన చెత్తాచెదారం ఉంది. దోమలు, ఈగలు ఎగురుతున్నాయి. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో వండిని ఆహార పదార్థాలు తింటే ప్రజలు అనారోగ్యం పాలవడం ఖాయమని భావించిన అధికారులు హోటల్‌ను సీజ్ చేశారు. దాడిలో శానిటరీ ఇంజినీర్ సుక్రుతారెడ్డి, ఏఈ శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.