
సాక్షి, హైదరాబాద్: అడిగిన వారికి, అడగని వారికి ఆపన్న హస్తం అందిస్తూ హీరో అనే పదానికే వన్నె తీసుకొచ్చిన నటుడు సోనూ సూద్. తన దాతృత్వంతో ఇప్పటికే అందనంత ఎత్తు ఎదిగిన ఈ రీల్ హీరో మరోసారి రియల్ హీరోగా నిలిచారు. ‘ఆచార్య' సినిమా యూనిట్ సభ్యులకు మొబైల్ ఫోన్స్ గిఫ్ట్‌గా ఇచ్చి తన చేతికి ఎముక లేదని నిరూపించుకున్నారు.
కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ సంక్షోభ కాలంలో వలస కార్మికులు మొదలు, అనేకమందిని అనేక రకాలుగా ఆదుకున్న సోనూ సూద్ తాజాగా తను నటిస్తున్న ఆచార్య సినిమా యూనిట్ సభ్యుల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ మూవీకి వర్క్ చేస్తున్న పేద కళాకారులు, టెక్నిషియన్లకు 100 మొబైల్ ఫోన్లు కానుకగా ఇచ్చారు. కాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ''ఆచార్య'’ సినిమాలో సోనూ సూద్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
(చదవండి: ‘ఆచార్య’ టెంపుల్ సెట్‌పై చిరు ఆసక్తికర ట్వీట్)