సోనూసూద్ పేరు వింటే చాలు ఎక్కడ ఆపదలో ఉన్నావారిని ఆదుకుంటున్నారో అనేలా అయిపోయింది. కరోనా కాలం నుంచి కష్టాల్లో ఉన్నావారికి సాయం చేస్తూ జనం గుండెల్లో రియల్ హీరోగా నిలిచిపోయారు. తాజాగా ఆయన సాయంలో మరో ముందడుగు వేశారు. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడి విద్యార్థులు ఆన్‌లైన్ క్లాస్‌లకే పరిమితమయ్యారు. దీంతో ఎంతో మంది పేద విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు లేక పాఠాలకు దూరమవుతున్నారు. అలాంటిని వారి గురించి ఏ రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.
విద్యార్థులేమో పాఠాలు వినడానికి ఎలాంటి దారి దొరకగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి సోను నేనున్నా చేయుత అందించారు. ఆయన ఉదారతను చాటుకుంటు లక్నోలో సమీప గ్రామాల్లోని పేద విద్యార్థినిలకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. 40 గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది పేద విద్యార్థినులకు ఆయన మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఫోన్లు అందుకున్న ఆ విద్యార్థినిలంత సోనూకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Actor-philanthropist @sonu_sood distributes smart phones to 300 underprivileged girls across 40 villages near Lucknow to help them attend online classes during the on-going pandemic.#sonusood pic.twitter.com/WXo6S1yBdR
— BARaju (@baraju_SuperHit) April 2, 2021
Comments
Please login to add a commentAdd a comment