
రియల్ హీరో సోనూసూద్ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియా వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు సహా సామాన్యులు ఆయనకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో అన్ని వర్గాల ప్రజలకు చేతనైనంత సాయం చేసి ఎంతోమందికి ప్రత్యక్ష దైవంగా మారాడు సోనూసూద్ బర్త్‌డే సందర్భంగా ఆచార్య టీం ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమాలో సోనూసూద్ కీలక పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే.
సోనూసూద్ బర్త్‌డే సందర్భంగా ఆచార్యలో ఆయన లుక్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. నుదుట బొట్టు పెట్టుకుని పిలకతో సోనూసూద్ డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. తెలుగు నాట ఎక్కువగా విలన్ పాత్రలతో పాపులర్ అయిన సోనూసూద్ ఆచార్య లుక్ ఆకట్టుకుంటుంది. ఇక చిరంజీవి ప్రధానపాత్రలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ కీలకపాత్రలో కనిపించనున్నారు.
Team #Acharya wishes the versatile actor & man with a golden heart @SonuSood a very Happy Birthday.
— Konidela Pro Company (@KonidelaPro) July 30, 2021
Megastar @KChiruTweets @AlwaysRamCharan @sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @DOP_Tirru @NavinNooli @sureshsrajan #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/sVTeANJKh0
Comments
Please login to add a commentAdd a comment