ముఖానికి మాస్క్ ఎందుకు? | Baahubali actress Anushka Shetty is cycling to reduce her Weight | Sakshi

ముఖానికి మాస్క్ ఎందుకు?

Aug 30 2016 12:32 AM | Updated on Sep 4 2017 11:26 AM

ముఖానికి మాస్క్ ఎందుకు?

ముఖానికి మాస్క్ ఎందుకు?

కాజు బర్ఫీలా కాస్త సన్నగా కనిపించే అనుష్క, ‘సైజ్ జీరో’ కోసం కాకినాడ కాజాలా కొంచెం ఎక్కువే ఒళ్లు చేశారు.

కాజు బర్ఫీలా కాస్త సన్నగా కనిపించే అనుష్క, ‘సైజ్ జీరో’ కోసం కాకినాడ కాజాలా కొంచెం ఎక్కువే ఒళ్లు చేశారు. ఆ సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో స్వీట్స్ ఎక్కువ తిన్న సుందరిలా స్వీటీ అనుష్క లావయ్యారు. ఇప్పుడు మిగతా సినిమాల్లో క్యారెక్టర్లు వెయిట్ తగ్గమని డిమాండ్ చేస్తున్నాయి. దాంతో స్వీటీ హైదరాబాద్ రోడ్ల మీద సైకిల్‌తో చక్కర్లు కొడుతున్నారు.
 
  వెయిట్ తగ్గడం కోసం ఇన్నాళ్లు చేసిన యోగా, జిమ్‌లో ఇతర వ్యాయామాలు ఏవీ అనుష్కకు అక్కరకు రాలేదట. చివరకు, ముఖానికి మాస్క్ వేసుకుని ప్రతి రోజూ ఉదయం హైదరాబాద్ రోడ్ల మీద 20 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తున్నారట. కాస్త సులభంగానే వెయిట్ పెరిగిన అనుష్క, తగ్గడానికి మాత్రం చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ‘బాహుబలి 2’, ‘భాగ్‌మతి’, ‘సింగం 3’ ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రాల్లో నటిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Advertisement