స్కిప్పింగ్‌ని వేరే లెవల్‌కి తీసుకెళ్లిందిగా ఈ డ్యాన్సర్‌! | Woman Can Skips Rope While Cycling, Viral Video Trending On Social Media - Sakshi
Sakshi News home page

స్కిప్పింగ్‌ని వేరే లెవల్‌కి తీసుకెళ్లిందిగా ఈ డ్యాన్సర్‌! వీడియో వైరల్‌

Published Sun, Oct 22 2023 11:46 AM | Last Updated on Tue, Oct 24 2023 1:37 PM

Viral Video: This Woman Can Skip Rope While Cycling - Sakshi

స్కిప్పింగ్‌ అదేనండి తాడాట అందరికి తెలిసింది. ముఖ్యంగా ఆడపిల్లలు ఎంతో ఇష్టంగా ఆడే ఆట. చాలా మంది పలురకాలుగా స్కిప్పింగ్‌ చేస్తారు. కానీ ఈ డ్యాన్సర్‌ చేసిన స్కిప్పింగ్‌ని చూస్తే మాటల్లు లేవు అనాల్సిందే!. ప్రత్యేకతను చాటుకోవాలనుకునే వారికి సాధ్యం కానిదేది ఉండదు అంటే ఇదేనేమో!

స్కిప్పింగ్‌ రోప్‌ (తాడాట) అనేది అసాధ్యమైనదేమీ కాదు. అందరూ చేసేదే. అయితే భోపాల్‌కు చెందిన డాన్సర్, ఆర్టిస్ట్‌ బుష్రా తాడాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఖాళీ రోడ్డు మీద సైకిలింగ్‌ చేస్తూనే తాడాట ఆడుతూ ‘ఆహా’ అనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌ వైరల్‌గా మారింది. ‘సూపర్బ్‌ బ్రిలియెంట్‌ టాలెంట్‌’ ‘దిస్‌ ఈజ్‌ వెరీ రిస్కీ సిస్టర్‌. ప్లీజ్‌ బీ కేర్‌ఫుల్‌’ ఇలా రకరకాల కామెంట్స్‌ కనిపించాయి. 

(చదవండి: ఔరా అండర్‌ వాటర్‌ గార్బా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement