skip
-
విచారణకు కేజ్రీ డుమ్మా!
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకల కేసులో గురువారం విచారణకు రావాలన్న ఈడీ సమన్లను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి బేఖాతరు చేసినట్టు సమాచారం. బుధవారమే ఆయన పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో విపాసన ధ్యానం కోర్సులో చేరేందుకు వెళ్లినట్లు వార్తలొచ్చాయి. ‘‘ఆయన ఏటా చలికాలంలో విపాసనకు వెళ్తారని అందరికీ తెలుసు. అయినా ఈడీ కావాలనే ఇప్పుడు సమన్లు ఇచ్చింది’’ అని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. దీనిపై ఈడీ తదుపరి చర్యలేమిటనేది తెలియాల్సి ఉంది. నవంబర్ 2న కేజ్రీవాల్‌ను ఈడీ విచారణకు పిలవగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందంటూ హాజరు కాలేదు. -
స్కిప్పింగ్‌ని వేరే లెవల్‌కి తీసుకెళ్లిందిగా ఈ డ్యాన్సర్!
స్కిప్పింగ్ అదేనండి తాడాట అందరికి తెలిసింది. ముఖ్యంగా ఆడపిల్లలు ఎంతో ఇష్టంగా ఆడే ఆట. చాలా మంది పలురకాలుగా స్కిప్పింగ్ చేస్తారు. కానీ ఈ డ్యాన్సర్ చేసిన స్కిప్పింగ్‌ని చూస్తే మాటల్లు లేవు అనాల్సిందే!. ప్రత్యేకతను చాటుకోవాలనుకునే వారికి సాధ్యం కానిదేది ఉండదు అంటే ఇదేనేమో! స్కిప్పింగ్ రోప్ (తాడాట) అనేది అసాధ్యమైనదేమీ కాదు. అందరూ చేసేదే. అయితే భోపాల్‌కు చెందిన డాన్సర్, ఆర్టిస్ట్ బుష్రా తాడాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఖాళీ రోడ్డు మీద సైకిలింగ్ చేస్తూనే తాడాట ఆడుతూ ‘ఆహా’ అనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. ‘సూపర్బ్ బ్రిలియెంట్ టాలెంట్’ ‘దిస్ ఈజ్ వెరీ రిస్కీ సిస్టర్. ప్లీజ్ బీ కేర్‌ఫుల్’ ఇలా రకరకాల కామెంట్స్ కనిపించాయి. View this post on Instagram A post shared by 🍁 B_ush_ra🍁 (@iamsecretgirl023) (చదవండి: ఔరా అండర్ వాటర్ గార్బా) -
Nepal Plane Crash: వద్దన్నా! పట్టుబట్టి డ్యూటీకి వెళ్లింది..ఓ నాన్న ఆవేదన
నేపాల్ విమానా ఘటన తర్వాత పలువురు గురించి వస్తున్న ఆసక్తికర విషయాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ఆ ఘటన బాధిత కుటుంబాలకు అంత తేలిగ్గా మర్చిపోలేని అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఆ దుర్ఘటన రోజు విధులు నిర్వర్తించేందకు వెళ్లిన ఫ్లైట్ అటెండెంట్ ఓషిన్ అలే మగర్ది మరో విషాద గాథ. ఆ ఫ్లైట్ అటెండెంట్ అలే మగర్ రెండేళ్లుగా యతి ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తోంది. ఆమె ఖట్మాండ్లో తన కుటుంబంతో నివశిస్తోంది. వాస్తవానికి ఆరోజు విధులు నిర్వర్తించాల్సింది కాదు. ఇంట్లో తండ్రి మోహన్ అలే మగర ఆమెను ఆరోజు డ్యూటీ మానేయమని, సంక్రాంతి పండుగ చేసుకుందామని చెప్పారు. అయినా సరే ఆమె పట్టుపట్టి మరీ ఆ రోజు విధులకు వెళ్లింది. పైగా తాను రెండు విమానాల్లో చేయాల్సిన డ్యూటీని ముగించుకుని సంక్రాంతి రోజుకల్లా వచ్చేస్తానంటూ వెళ్లిందన ఆమె తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. కచ్చితంగా సంక్రాంతి రోజున ఇంట్లోనే ఉంటానని హామీ ఇచ్చిందంటూ విలపించారు. అంతలోనే ఈ ప్రమాదం బారిన పడి కానరాని లోకాలకు వెళ్లిపోయిందని ఆవేదనగా చెప్పారు. ఆమెకు పెళ్లై రెండేళ్లే అయ్యిందని, ఆమె భర్త యూకేలో ఉన్నట్లు తెలిపారు. ఐతే ఇప్పుడూ ఆ ఫ్టైల్ అటెండెంట్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..నెటిజన్లు ఆ యతి ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోడానికి కొన్ని క్షణాల ముందు రికార్డు చేసిన వీడియో అని వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఇది గతేడాది సెప్టెంబర్ 11న రికార్డు చేసిన వీడియో అని, విమానం క్రాష్ జరగడానికి ముందు తీసినది కాదని ఆమె టిక్‌టాక్‌లో షేర్ చేసిన వీడియో ఆధారంగా తెలుస్తోంది. కాగా, నేపాల్‌లో ఆదివారం యతి ఎయిర్‌లైన్ ఏటీఆర్ 72 విమానం కూలి సుమారు 68 మంది దాక మృతి చెందిన సంగతి తెలిసిందే. The Air hostess in #YetiAirlinesCrash Live life to the fullest as long as you are alive because death is unexpected! Just sharing TikTok video of Air Hostess Oshin Magar who lost her life in #NepalPlaneCrash today जहां भी रहो ऐसे ही रहो! Rest in Peace !!💐#Nepal #planecrash pic.twitter.com/Bh6DBDnhnt — Deep Ahlawat 🇮🇳🎭 (@DeepAhlawt) January 15, 2023 (చదవండి: ఆ విమానం నేరుగా మావైపే వచ్చింది... వెలుగులోకి కీలక విషయాలు) -
హోలీ వేడుకలకు దూరంగా ఉందాం!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తూ...మెల్లగా మన దేశంలో కూడా నేనున్నాంటున్న కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తిపై ఉలాంటి ఆందోళన అవసరం లేదని ప్రకటించిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న కరోనా వైరస్ ఆందోళనల దృష్ట్యా, ఈ సంవత్సరం హోలీ వేడుకలకు దూరంగా వుంటున్నానని ప్రధాని ప్రకటించారు. అలాగే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు హోలీ పండుగ వేడుకలకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విటర్లో ఒక సందేశాన్ని ట్వీట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సామూహిక సమావేశాలను తగ్గించాలని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఇటలీనుంచి వచ్చిన టూరిస్టులు 15 మందికి వ్యాధి సోకినట్టుగా బుధవారం నిర్ధారణ అయింది. దీంతో తాజా కేసులతో భారతదేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 18కి చేరింది. చదవండి : కరోనా కలవరం: ఢిల్లీలో మరో 15 కేసులు, కరోనా ఎఫెక్ట్: ఆ ఎగుమతులపై ఆంక్షలు Experts across the world have advised to reduce mass gatherings to avoid the spread of COVID-19 Novel Coronavirus. Hence, this year I have decided not to participate in any Holi Milan programme. — Narendra Modi (@narendramodi) March 4, 2020 -
ట్రంప్ పై వెనక్కి తగ్గిన టెక్ దిగ్గజాలు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ట్రావెల్‌బ్యాన్‌పై పోరాటానికి టెక్ దిగ్గజాలు వెనక్కి తగ్గాయి. ఏడు ముస్లిందేశాల ప్రజలపై విధించిన వీసా బ్యాన్పై ఆపిల్, గూగుల్, ఫేస్బుక్ సహా ఆరంభంలో తీవ్రంగా స్పందించిన దాదాపు 60 సంస్థలు ఈ పోరాటంనుంచి పక్కకు తప్పుకున్నాయి. ట్రంప్ జారీ చేసిన సెకెండ్ వెర్షన్ ఆర్డర్‌పై పోరాడేందుకు ఈ సంస్థలు నిరాకరించినట్టు తెలుస్తోంది. సిలికాన్ వ్యాలీ కంపెనీల తరపున మంగళవారం హవాయి ఫెడెరల్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మైక్రోసాఫ్ట్, ఈ బే ఇంటెల్ కార్ప్, నెట్‌ఫ్లిక్స్, ట్విట్టర్ లాంటి ప్రముఖ టెక్ కంపెనీలు సంతకం చేయలేదని సమాచారం. అయితే ఇంతకుముందు ఈ పోరాటంలో ఉన్న ఎయిర్ బీఎన్బీ, డ్రాప్‌బాక్స్, కిక్‌స్టార్ లాంటి ఇతర కంపెనీలు కొన్ని తాజా పిటిషన్ పై కూడా సంతకం చేశాయి. ట్రంప్ రెండవ బ్యాన్ ఆర్డర్ లో ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, సిరియా, యెమన్ తదితర ఆరు ముస్లిం దేశాలపై విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన దావాను సమర్ధించకూడదని 58 టెక్నాలజీ కంపెనీలు నిర్ణయించుకున్నాయిట. అయితే ఈ వార్తలపై ఆపిల్, గూగుల్, ఈబే, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు వెంటనే స్పందించేందుకు నిరాకరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత నెల ఏడు ముస్లిం దేశాల ప్రజలు అమెరికాలో పర్యటించకుండా ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించారు. అయితే అమెరికాలోని వివిధ కోర్టులు సహా, పలు టెక్ సంస్థల నిరసనల నేపథ్యంలో ఇరాక్‌ను మినహాయించి, ఆరు ముస్లిం దేశాలకు చెందిన పౌరులు, శరణార్థులు అమెరికాకు రాకుండా సరికొత్త ప్రయాణ నిషేధాజ్ఞల (ట్రావెల్ బ్యాన్)ను ప్రకటించారు. మరోవైపు ఈ ఆదేశాలను సైతం హవాయ్‌లోని ఫెడరల్ కోర్టు జడ్జి నిలిపివేశారు మరికొన్ని గంటల్లో ఈ నిషేధం అమల్లోకి రానుండగా.. అధ్యక్షుడి తాజా కార్యనిర్వాహక ఉత్తర్వు చట్టబద్ధంగా లేదంటూ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి డెరిక్ వాట్సన్ దీనిని నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా ఒకవైపు అమెరికా కోర్టులు ట్రంప్ బ్యాన్పై స్థిరంగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంటే.. మరోవైపు ముందు దూకుడును ప్రదర్శించిన టెక్ దిగ్గజాలు తాజాగా వెనక్కి తగ్గడం ఆసక్తికరంగా మారింది. -
డుమ్మాకొట్టిన ..దీదీ, ఒమర్ అబ్దుల్లా
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఆదివారమిక్కడ ప్రారంభమైంది. ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న సంస్థ రూపురేఖలు, పనితీరుపై ఈ సదస్సులో మోదీ చర్చించనున్నారు. కాగా ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గైర్హాజరయ్యారు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా, మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్న దీదీ ఈ సదస్సుకు డుమ్మా కొట్టారు. అయితే బెంగాల్ అభివృద్ధిపై కేంద్రం వివక్ష చూపిస్తోందన్న ఆరోపణలతో మమతా ..సీఎంల సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది.