డుమ్మాకొట్టిన ..దీదీ, ఒమర్ అబ్దుల్లా | Mamata Banerjee, Omar Abdullah to skip meeting of Chief Ministers | Sakshi
Sakshi News home page

డుమ్మాకొట్టిన ..దీదీ, ఒమర్ అబ్దుల్లా

Published Sun, Dec 7 2014 11:18 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

డుమ్మాకొట్టిన ..దీదీ, ఒమర్ అబ్దుల్లా - Sakshi

డుమ్మాకొట్టిన ..దీదీ, ఒమర్ అబ్దుల్లా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఆదివారమిక్కడ ప్రారంభమైంది.

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఆదివారమిక్కడ ప్రారంభమైంది. ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న సంస్థ రూపురేఖలు, పనితీరుపై ఈ సదస్సులో మోదీ చర్చించనున్నారు. కాగా  ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గైర్హాజరయ్యారు.

జమ్మూకశ్మీర్లో ఎన్నికల నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా,  మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్న దీదీ ఈ సదస్సుకు డుమ్మా కొట్టారు. అయితే బెంగాల్ అభివృద్ధిపై కేంద్రం వివక్ష చూపిస్తోందన్న ఆరోపణలతో మమతా  ..సీఎంల సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement