రెండో రౌండ్‌కు ఆంథోని | Anthony to the second round | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌కు ఆంథోని

Published Sat, May 9 2015 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM

రెండో రౌండ్‌కు ఆంథోని

రెండో రౌండ్‌కు ఆంథోని

తెలంగాణ-ఏపీ స్నూకర్ టోర్నీ
 

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ-ఏపీ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో క్యూ మ్యాక్స్‌కు చెందిన జె. ఆంథోని రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. సికింద్రాబాద్‌లోని డెక్కన్ క్లబ్‌లో ఈ పోటీలు జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన సీని యర్ విభాగం తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆంథోని 3-2 ఫ్రేమ్స్ తేడాతో ఫెరోజ్ అలీ (ఎస్డీ పార్లర్) పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆంథో ని 57-14, 28-82, 69-30, 43-60, 57-28 స్కోరుతో అలీపై ఆధిపత్యం ప్రదర్శించాడు.

 ఇతర తొలి రౌండ్ ఫలితాలు : సల్మాన్ 66-28, 53-23, 45-37తో విభాస్‌పై, చింటూ 63-41, 16-46, 51-37, 69-18తో సురేశ్‌పై, కార్తీక్ 59-40, 15-49, 8-68, 15-52తో సుధీర్‌పై, యశ్వంత్ 63-25, 63-38, 48-28తో వంశీకృష్ణా రెడ్డిపై విజయం సాధించారు. దేవ్ 55-31, 69-55, 25-53, 31-61, 46-32తో హేమంత్ సింగ్ ఠాకూర్‌ను, రియాజ్ 73-51, 18-62, 64-62, 65-35తో ధీరజ్‌ను, సతీశ్ 45-5, 74-7, 61-27తో షాదిద్‌ను, సాయిచంద్ 47-56, 61-28, 48-59, 47-12, 43-18తో నరేశ్ కుమార్‌ను ఓడించారు.

విజయా రెడ్డి 23-44, 21-51, 28-34తో కేవల్ చేతిలో, బిర్జి 5-42, 27-40, 32-45తో బి. రవీందర్ చేతిలో, రాజ్ కుమార్ 12-43, 49-8, 43-60, 13-62తో భరత్ చేతిలో, అనిరుధ్ 14-57, 28-82, 30-69 తేడాతో నాగార్జున చేతిలో పరాజయంపాలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement