క్వార్టర్స్‌లో పంకజ్ అద్వానీ | Pankaj Advan enters in quarter finals in snooker championship | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో పంకజ్ అద్వానీ

Published Sun, Jun 29 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

Pankaj Advan enters in quarter finals in snooker championship

షార్మ్ ఎల్ షీక్ (ఈజిప్టు): వరల్డ్ 6-రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో  భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్‌లో శనివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో పంకజ్ 4-0తో అలెక్స్ బోర్గ్ (మాల్టా)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో కమల్ చావ్లా 2-4తో మెహసెన్ బుక్షాషీష్ (ఖతర్) చేతిలో ఓటమిపాలయ్యాడు. 15-రెడ్ స్నూకర్ టీమ్ ఈవెంట్‌లో భారత జోడీలు నిరాశపర్చాయి.
 
  క్వార్టర్స్‌లో పంకజ్-బ్రిజేష్ దమానీ జోడి 1-4తో మహ్మద్ ఆసిష్-సజ్జాద్ హుస్సేనీ (పాకిస్థాన్) చేతిలో; సౌరవ్ కొఠారీ-శివమ్ అరోరా ద్వయం 0-4తో హోస్సెనీ వాఫెయి అయోరీ-ఎహ్‌సాన్ హైదర్ అలీ (ఇరాన్) చేతిలో పరాజయం చవిచూశాయి. మహిళల విభాగంలో విద్య పిళ్లై-అమీ కామని 3-0తో జెస్సీకా వుడ్స్-క్యాతీ పరాశీష్‌పై నెగ్గారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement