
నాకౌట్ దశకు అద్వానీ
బిష్‌కెక్ (కిర్గిస్తాన్): ఆసియా 6–రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ పంకజ్ అద్వానీ (భారత్) నాకౌట్ దశకు అర్హత సాధించాడు. గ్రూప్ దశలోని పంకజ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచాడు. తొలి మ్యాచ్‌లో 5–2తో ఫైతూన్ ఫోన్‌బన్ (థాయ్‌లాండ్)పై, రెండో మ్యాచ్‌లో 5–3తో అలీ రోషనికియా (ఇరాన్)పై, మూడో మ్యాచ్‌లో 5–3తో ఒమర్ అలీ (ఇరాక్)పై విజయం సాధించాడు.