
పంకజ్‌కు కోల్‌కతా ఓపెన్ టైటిల్
కోల్‌కతా: భారత క్యూ స్పోర్ట్స్ స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ కోల్‌కతా ఓపెన్ జాతీయ ఇన్విటేషనల్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్ ఆదిత్య మెహతాతో ఆదివారం జరిగిన ఫైనల్లో పంకజ్ 5–1 (75–56, 76–19, 87–47, 73–17, 0–101, 116–0) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు.