క్వార్టర్‌ ఫైనల్లో హిమాన్షు జైన్‌ | Himanshu Jain Books Spot in Quarters of All India Snooker | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో హిమాన్షు జైన్‌

Published Mon, Mar 18 2019 10:14 AM | Last Updated on Mon, Mar 18 2019 10:14 AM

Himanshu Jain Books Spot in Quarters of All India Snooker - Sakshi

ముంబై: ఆలిండియా ఓపెన్‌ స్నూకర్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో హిమాన్షు జైన్‌  క్వార్టర్స్‌కు చేరుకోగా... లక్కీ వత్నాని ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో హిమాన్షు జైన్‌  (తెలంగాణ) 4–0 (78–50, 59–30, 89–50, 72–34)తో రూపేశ్‌ షా (గుజరాత్‌)పై గెలుపొందగా... లక్కీ వత్నాని (తెలంగాణ) 3–4 (54–72, 29–71, 63–16, 44–53, 58–38, 72–31, 18–57)తో ఇష్‌ప్రీత్‌ సింగ్‌ చద్దా (ముంబై) చేతిలో ఓడిపోయాడు.

అంతకుముందు జరిగిన రౌండ్‌–32 మ్యాచ్‌ల్లో లక్కీ వత్నాని (తెలంగాణ) 4–3 (24–67(52), 77–58, 62–19, 33–77(45), 45–40, 7–61, 66 (52)–0)తో స్పర్‌న్ష్‌ పేర్వానీ (ముంబై)పై, హిమాన్షు జైన్‌ (తెలంగాణ) 4–1 (59–55, 61–43, 69–8, 11–71, 66–18)తో మోను చౌదరీ (ఢిల్లీ)పై గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కి అర్హత సాధించారు.

ఇతర ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ల ఫలితాలు

పంకజ్‌ అద్వానీ (ఓఎన్‌జీసీ) 4–2 (99–33, 36–103(74), 44–65, 62–54, 95(53)–25, 89–13)తో అనురాగ్‌ గిరి (మధ్యప్రదేశ్‌)పై, ముకుంద్‌ భరాడియా (ముంబై) 4–3 (22–82(69), 24–56, 69–24, 74–48, 65–21, 55–67, 47–38)తో బ్రిజేశ్‌ దామని (ఇండియన్‌  ఆయిల్‌)పై, మల్‌కీత్‌ సింగ్‌ (రైల్వేస్‌) 4–3 (63(40)–12, 43–79, 82(82)–0, 53–60, 9–55, 66–40, 73–43)తో ఎస్‌. దిలీప్‌ కుమార్‌ (రైల్వేస్‌)పై, ఆదిత్య మెహతా (ఓఎన్‌ జీసీ) 4–1 (1–88(69), 79(57)–42, 91(91)–23, 73(68)–1, 62(43)–24)తో ఆర్‌. గిరీశ్‌ (రైల్వేస్‌)పై, వరుణ్‌ మదన్‌ (ఢిల్లీ) 4–2 (2–61, 1–76, 70–27, 64(42)–16, 84(52)–16, 88(67)–21)తో సుమిత్‌ తల్వార్‌ (చండీగఢ్‌)పై, లక్ష్మణ్‌ రావత్‌ (ఇండియన్‌ ఆయిల్‌) 4–2 (62–34, 35–74, 65–25, 36–95, 75–39, 68–7)తో మనన్‌  చంద్ర (బీపీసీఎల్‌)పై గెలుపొందారు.   
, , ,

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement