Himanshu Jain
-
చాంపియన్ హిమాన్షు జైన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్నూకర్ అండ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో హిమాన్షు జైన్ సత్తా చాటాడు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో సీనియర్ స్నూకర్ విభాగంలో హిమాన్షు చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో లక్కీ వత్నానీ రన్నరప్ టైటిల్‌ను అందుకోగా... నబిల్ లక్డావాలా, మొహమ్మద్ గౌస్ వరుసగా మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నారు. జూనియర్స్ విభాగంలో ముస్తాక్ విజేతగా నిలిచాడు. విభాస్ రన్నరప్ ట్రోఫీని అందుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ క్యూ స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ స్పోర్ట్స్ చైర్మన్ చాముండేశ్వరీనాథ్, కార్యదర్శి కేఎస్ రామారావు, వైస్ చైర్మన్ బంగార్రాజు, తెలంగాణ క్యూ స్పోర్ట్స్ సంఘం సంయుక్త కార్యదర్శి అప్పారావు పాల్గొన్నారు. -
క్వార్టర్ ఫైనల్లో హిమాన్షు జైన్
ముంబై: ఆలిండియా ఓపెన్ స్నూకర్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో హిమాన్షు జైన్ క్వార్టర్స్‌కు చేరుకోగా... లక్కీ వత్నాని ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో హిమాన్షు జైన్ (తెలంగాణ) 4–0 (78–50, 59–30, 89–50, 72–34)తో రూపేశ్ షా (గుజరాత్)పై గెలుపొందగా... లక్కీ వత్నాని (తెలంగాణ) 3–4 (54–72, 29–71, 63–16, 44–53, 58–38, 72–31, 18–57)తో ఇష్ప్రీత్ సింగ్ చద్దా (ముంబై) చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు జరిగిన రౌండ్–32 మ్యాచ్‌ల్లో లక్కీ వత్నాని (తెలంగాణ) 4–3 (24–67(52), 77–58, 62–19, 33–77(45), 45–40, 7–61, 66 (52)–0)తో స్పర్‌న్ష్ పేర్వానీ (ముంబై)పై, హిమాన్షు జైన్ (తెలంగాణ) 4–1 (59–55, 61–43, 69–8, 11–71, 66–18)తో మోను చౌదరీ (ఢిల్లీ)పై గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కి అర్హత సాధించారు. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు పంకజ్ అద్వానీ (ఓఎన్జీసీ) 4–2 (99–33, 36–103(74), 44–65, 62–54, 95(53)–25, 89–13)తో అనురాగ్ గిరి (మధ్యప్రదేశ్)పై, ముకుంద్ భరాడియా (ముంబై) 4–3 (22–82(69), 24–56, 69–24, 74–48, 65–21, 55–67, 47–38)తో బ్రిజేశ్ దామని (ఇండియన్ ఆయిల్)పై, మల్కీత్ సింగ్ (రైల్వేస్) 4–3 (63(40)–12, 43–79, 82(82)–0, 53–60, 9–55, 66–40, 73–43)తో ఎస్. దిలీప్ కుమార్ (రైల్వేస్)పై, ఆదిత్య మెహతా (ఓఎన్ జీసీ) 4–1 (1–88(69), 79(57)–42, 91(91)–23, 73(68)–1, 62(43)–24)తో ఆర్. గిరీశ్ (రైల్వేస్)పై, వరుణ్ మదన్ (ఢిల్లీ) 4–2 (2–61, 1–76, 70–27, 64(42)–16, 84(52)–16, 88(67)–21)తో సుమిత్ తల్వార్ (చండీగఢ్)పై, లక్ష్మణ్ రావత్ (ఇండియన్ ఆయిల్) 4–2 (62–34, 35–74, 65–25, 36–95, 75–39, 68–7)తో మనన్ చంద్ర (బీపీసీఎల్)పై గెలుపొందారు. , , , -
చాంపియన్ హిమాన్షు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ స్నూకర్, బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో హిమాన్షు జైన్ విజేతగా నిలిచాడు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్సీసీ)లో జరిగిన ఈ టోర్నీలో సీనియర్ స్నూకర్ విభాగంలో హిమాన్షు టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్లో హిమాన్షు 5–3 ఫ్రేమ్‌ల తేడాతో (38–93, 73–16, 40–66, 79–29, 76–0, 59–66, 74–42, 85–0) మొహమ్మద్ గౌస్‌పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో హిమాన్షు 87–13, 86–4, 82–34, 85–4, 65–47తో ముస్తాక్‌పై గెలుపొందగా, గౌస్ 51–64, 9–61, 55–26, 43–54, 64–11, 39–84, 61–43, 62–30, 70–12తో నబిల్‌ను ఓడించాడు. -
22 లక్షల జాబ్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసి!
ఈ-రిటైల్ దిగ్గజం అమెజాన్ అతనికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏడాదికి రూ. 22 లక్షలు జీతం ఆఫర్ చేస్తూ జాబ్‌ను ఇవ్వజూపింది. కానీ అతను ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. తన కలల ఐఏఎస్ కొలువు కోసం అంతటి ఆఫర్‌ను తృణప్రాయంగా త్యజించాడు. అతనే హర్యానాకు చెందిన హిమాన్షు జైన్. తాజా సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా 44వ ర్యాంకు సాధించిన ఈ కుర్రాడు హైదరాబాద్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో కంప్యూటర్ సైన్స్ పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాడు. ఆ వెంటనే అతనికి అమెజాన్, గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి జాబ్ ఆఫర్లు వచ్చాయి. కానీ, తన జీవితగమ్యం కార్పొరేట్ కంపెనీల్లో కొలువు చేయడం కాదని హిమాన్షుకు అనిపించింది. అందుకే అమెజాన్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడే ప్రారంభంలో రూ. 22లక్షల జీతంలో ఉద్యోగం ఇస్తామని ఆ సంస్థ ఆఫర్ చేసినా.. హిమాన్షు తిరస్కరించాడు. ఆ తర్వాత రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియాలో మేనేజర్ ఉద్యోగం వచ్చింది. అక్కడ అతని మనస్సు నిలువలేదు. అతనికి ఐఏఎస్ ఉద్యోగం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. 'ఒక ఐఏఎస్ అధికారి దేశంలో మార్పు తీసుకురాగలడని మా కుటుంబసభ్యులు, టీచర్లు ఎప్పుడూ చెప్పేవారు. అప్పటి నుంచి సివిల్సే లక్ష్యంగా పెట్టుకున్నా' అని చెప్పిన హిమాన్షు.. ఆర్బీఐలో సైతం ఉద్యోగం వదిలేసి సివిల్స్‌కు సిద్ధమయ్యేందుకు ఢిల్లీ వచ్చాడు. మొదటి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్‌ను అధిగమించినా.. మెయిన్స్‌లో విఫలమయ్యాడు. మూడో ప్రయత్నంలో రెట్టించిన ఉత్సాహంతో, మరింత అకుంఠిత దీక్షతో సివిల్స్ రాసి అనుకున్నది సాధించాడు. 44వ ర్యాంకు సాధించిన ఈ యువకెరటం కలలను నిజం చేసుకోవాలంటే అవి సాకారమయ్యే వరకు వాటిని వెంటాడుతూనే ఉండాలని చెప్తున్నాడు. -
హిమాన్షు, శంకర్ ఓటమి
కోల్‌కతా: జాతీయ సీనియర్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు హిమాన్షు జైన్ (తెలంగాణ), శంకర్ రావు (ఆంధ్రప్రదేశ్) తమ లీగ్ మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశారు. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో శంకర్ రావు 0-3 ఫ్రేమ్‌ల తేడాతో ఆమీర్ హుస్సేన్ (బెంగాల్) చేతిలో; హిమాన్షు జైన్ 2-3 ఫ్రేమ్‌ల తేడాతో ధ్వజ్ హారియా (పీఎస్‌పీబీ) చేతిలో ఓటమి చెందారు. -
హిమాన్షు శుభారంభం
జాతీయ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ కోల్‌కతా: జాతీయ సీనియర్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్ హిమాన్షు జైన్ శుభారంభం చేశాడు. సోమవారం మొదలైన ఈ పోటీల్లో భాగంగా జరిగిన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో హిమాన్షు 3-0 (101-69, 100-76, 100-98) ఫ్రేమ్‌ల తేడాతో కన్కన్ షంషీ (ఉత్తరప్రదేశ్)పై విజయం సాధించాడు. గ్రూప్ ‘హెచ్’లో తెలంగాణకే చెందిన మరో ప్లేయర్ ఎం.ఎన్.రంజిత్ 0-3 (68-100, 0-100, 75-100) ఫ్రేమ్‌ల తేడాతో జైవీర్ ఢింగ్రా (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐ.వి.రాజీవ్, ఎస్.శంకర్ రావు తమ లీగ్ మ్యాచ్‌ల్లో ఓటమి పాల య్యారు. రాజీవ్ 2-3 (100-59, 100-60, 92-100, 47-100, 67-100) ఫ్రేమ్‌ల తేడాతో నిఖిల్ గాడ్గే (రైల్వేస్) చేతిలో; శంకర్ రావు 0-3 (67-101, 83-100, 49-100) ఫ్రేమ్‌ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ సౌరవ్ కొఠారి (పీఎస్‌పీబీ) చేతిలో పరాజయాన్ని చవిచూశారు.