
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్నూకర్ అండ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో హిమాన్షు జైన్ సత్తా చాటాడు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో సీనియర్ స్నూకర్ విభాగంలో హిమాన్షు చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో లక్కీ వత్నానీ రన్నరప్ టైటిల్‌ను అందుకోగా... నబిల్ లక్డావాలా, మొహమ్మద్ గౌస్ వరుసగా మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నారు.
జూనియర్స్ విభాగంలో ముస్తాక్ విజేతగా నిలిచాడు. విభాస్ రన్నరప్ ట్రోఫీని అందుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ క్యూ స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ స్పోర్ట్స్ చైర్మన్ చాముండేశ్వరీనాథ్, కార్యదర్శి కేఎస్ రామారావు, వైస్ చైర్మన్ బంగార్రాజు, తెలంగాణ క్యూ స్పోర్ట్స్ సంఘం సంయుక్త కార్యదర్శి అప్పారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment