
‘ఆసియా’ రన్నరప్ అద్వానీ
దోహా: తన కెరీర్‌లో లోటుగా ఉన్న ఆసియా స్నూకర్ (15–రెడ్ ఫార్మాట్) చాంపియన్‌షిప్ టైటిల్‌ను అందుకోవాలని ఆశించిన భారత స్టార్ పంకజ్ అద్వానీకి నిరాశ ఎదురైంది. శుక్రవారం ముగిసిన ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో 31 ఏళ్ల పంకజ్ 3–6 (32–95, 75–31, 43–69, 24–65, 78–0, 6–102, 61–48, 48–59, 69–71) ఫ్రేమ్‌ల తేడాతో 19 ఏళ్ల హావోతియాన్ (చైనా) చేతిలో ఓడిపోయాడు.
ఒకవేళ పంకజ్ గెలిచిఉంటే క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లో ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను పూర్తి చేసుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించేవాడు. బిలియర్డ్స్, స్నూకర్ క్రీడల్లో జాతీయ, ఆసియా, వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో లాంగ్, షార్ట్ ఫార్మాట్‌లలో టైటిల్స్ నెగ్గిన పంకజ్ ఖాతాలో ఆసియా (15–రెడ్ ఫార్మాట్) టైటిల్ మాత్రం ఇంకా చేరలేదు.