దోహా: మరోసారి అద్భుత ఆటతీరును ప్రదర్శించిన భారత క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ కెరీర్‌లో 18వ ప్రపంచ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. సోమవారం ముగిసిన ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో 32 ఏళ్ల పంకజ్ అద్వానీ చాంపియన్‌గా నిలిచాడు. అమీర్ సర్ఖోష్ (ఇరాన్)తో జరిగిన ఫైనల్లో పంకజ్ 8–2 (19–71, 79–53, 98–23, 69–62, 60–5, 0–134, 75–7, 103–4, 77–13, 67–47) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 7–4 ఫ్రేమ్‌ల తేడాతో 15 ఏళ్ల ఫ్లోరియన్ నుబిల్ (ఆస్ట్రియా)పై; క్వార్టర్ ఫైనల్లో 6–2 ఫ్రేమ్‌ల తేడాతో లువో హాంగ్‌హావో (చైనా)పై గెలిచాడు.
బెంగళూరుకు చెందిన పంకజ్ గతంలో ఐదుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్; 2017, 2016, 2014, 2008, 2005) టైటిల్స్‌ను... ఏడుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (టైమ్ ఫార్మాట్; 2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005) టైటిల్స్‌ను... మూడు సార్లు ప్రపంచ స్నూకర్ (2017, 2015, 2003) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్ (2015, 2014) టైటిల్స్‌ను... ఒకసారి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ (2014) టైటిల్‌ను సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment