పంకజ్‌కు జాతీయ స్నూకర్ టైటిల్ | Senior National Snooker Championship: Double delight for Pankaj Advani | Sakshi
Sakshi News home page

పంకజ్‌కు జాతీయ స్నూకర్ టైటిల్

Published Sun, Jan 25 2015 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

పంకజ్‌కు జాతీయ స్నూకర్ టైటిల్

పంకజ్‌కు జాతీయ స్నూకర్ టైటిల్

కోల్‌కతా: భారత స్టార్ పంకజ్ అద్వానీ... జాతీయ సీనియర్ స్నూకర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. బెంగాల్ రోయింగ్ క్లబ్‌లో శనివారం జరిగిన ఫైనల్లో అద్వానీ 6-3 (83 (45)-15, 73 (54)-35, 27- 86 (57), 79 (47)-00, 13-87 (62), 76 (70)-35, 48-72, 74 (74)-00, 96 (81)-09)తో వరుణ్ మదన్‌పై విజయం సాధిం చాడు. క్వాలిఫయర్‌గా బరిలోకి దిగి తొలిసారి ఫైనల్ వరకు వచ్చిన మదన్... మూడు, ఐదు, ఏడో ఫ్రేమ్‌ల్లో నెగ్గి 3-4 స్కోరుతో నిలిచాడు.

అయితే ఇక్కడి నుంచి అద్వానీ తన సత్తాను చూపెట్టాడు.  గతవారమే బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌ను నెగ్గిన అద్వానీ 2009 తర్వాత నాలుగోసారి రెండు టైటిల్స్‌ను సాధించాడు. ఇప్పటికే ఏడు సీనియర్ నేషనల్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లను సొంతం చేసుకున్న పంకజ్ అన్ని వయసు గ్రూప్‌ల్లో కలిసి 26 టైటిల్స్‌ను సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement