
ఆసియా బిలియర్డ్స్ చాంప్ ధ్రువ్
ఫైనల్లో అద్వానీకి షాక్
బీజింగ్: ముంబైకి చెందిన రైజింగ్ స్టార్ ధ్రువ్ సిత్వాలా సంచలన విజయంతో ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ సాధించాడు. ఫైనల్లో వెటరన్ స్టార్, ప్రపంచ చాంపియన్ అయిన పంకజ్ అద్వానీకి షాకిచ్చి తొలి అంతర్జాతీయ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత క్యూయిస్ట్‌లు ఆధిపత్యం చెలాయించిన ఈ టోర్నీలో సిత్వాలా అంచనాలకు మించి రాణించాడు. ఫైనల్లో అతను 6-3 ఫ్రేమ్‌ల తేడాతో దిగ్గజ ఆటగాడిని కంగుతినిపించాడు. సౌరవ్ కొఠారి, ప్రప్రుత్ (థాయ్‌లాండ్) ఉమ్మడిగా కాంస్య పతకాలు గెలచుకున్నారు.