పంకజ్‌కు మరో ప్రపంచ టైటిల్ | Another world title for Pankaj | Sakshi
Sakshi News home page

పంకజ్‌కు మరో ప్రపంచ టైటిల్

Published Sat, Oct 25 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM

పంకజ్‌కు మరో ప్రపంచ టైటిల్

పంకజ్‌కు మరో ప్రపంచ టైటిల్

లీడ్స్ (ఇంగ్లండ్): భారత ‘క్యూ స్పోర్ట్స్’ స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ తన ఖాతాలో 11వ ప్రపంచ టైటిల్‌ను జమచేసుకున్నాడు. శుక్రవారం ముగిసిన 150 పాయింట్ల ఫార్మాట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ బెంగళూరు క్రీడాకారుడు విజేతగా నిలిచాడు. పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)తో జరిగిన ఫైనల్లో 29 ఏళ్ల పంకజ్ అద్వానీ 6-2 (23-151, 151-16, 116-150, 151-104, 150-0, 151-58, 150-4, 150-145) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 5-2తో భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారిని ఓడించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement