పంకజ్ ఖాతాలో 16వ ప్రపంచ టైటిల్
పంకజ్ ఖాతాలో 16వ ప్రపంచ టైటిల్
బెంగళూరు: సొంతగడ్డపై రాణించిన భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లో 16వ ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సోమవారం జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ 150 అప్ ఫార్మాట్ ఫైనల్లో 31 ఏళ్ల పంకజ్ 6–3 (150–33, 150–95, 124–150, 101–150, 150–50, 150–35, 86–150, 150–104, 150–15) ఫ్రేమ్‌ల తేడాతో పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)ను ఓడించాడు.
సెమీఫైనల్స్‌లో పంకజ్ 5–0తో ఆంగ్ హెచ్‌టె (మయన్మార్)పై, పీటర్ 5–1తో ధ్వజ్ హరియా (భారత్)పై గెలిచారు. గతంలో పంకజ్ బిలియర్డ్స్ టైమ్ ఫార్మాట్‌లో ఏడుసార్లు, పాయింట్స్ ఫార్మాట్‌లో మూడుసార్లు, టీమ్ ఫార్మాట్‌లో ఒకసారి, స్నూకర్‌లో రెండుసార్లు, సిక్స్ రెడ్ స్నూకర్‌లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచాడు.