
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఖతర్‌లోని దోహాలో శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో పంకజ్ 5–1 (69–8, 115–33, 75–56, 0–94, 101–18, 97–33) ఫ్రేమ్‌ల తేడాతో అసద్ ఇక్బాల్ (పాకిస్తాన్)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన 17 ఏళ్ల కుర్రాడు లువో హాంగ్‌హవోతో పంకజ్ తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment