quarters finals
-
క్వార్టర్స్‌లో సాత్విక్ జోడీ
కోపెన్‌హాగెన్ (డెన్మార్క్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–15, 19–21, 21–9తో లియో రాలీ కార్నండొ–డానియెల్ మారి్టన్ (ఇండోనేసియా) జోడీపై నెగ్గింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ 14–21, 9–21తో టాప్ సీడ్ చెన్ క్వింగ్ చెన్–జియా యి ఫ్యాన్ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ ప్రణయ్ (భారత్) 21–18, 15–21, 21–19తో 2021 ప్రపంచ చాంపియన్ లో కియాన్ యూ (సింగపూర్)పై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరగా... లక్ష్య సేన్ (భారత్) 14–21, 21–16, 13–21తో మూడో సీడ్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. -
యూఎస్ ఓపెన్‌లో సంచలనం..!
న్యూయార్క్ : యూఎస్ ఓపెన్‌లో మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సంచలనం నమోదైంది. స్విస్ దిగ్గజం, మూడో సీడ్ రోజర్ ఫెదరర్ అన్‌సీడెడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆర్థర్ ఆషే స్టేడియంలో ఐదు సెట్లపాటు కొనసాగిన ఈ మ్యాచ్‌లో దిమిత్రోవ్ 3-6, 6-4, 3-6, 6-4, 6-2 తేడాతో విజయం సాధించాడు. శుక్రవారం జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఐదో సీడ్ డానియెల్ మెద్వెదేవ్ (రష్యా)తో దిమిత్రోవ్ తలపడతాడు. 28 ఏళ్ల అనంతరం బల్గేరియా ఆటగాడు యూఎస్ ఓపెన్ సెమీఫైనల్లో ప్రవేశించడం ఇదే ప్రథమం. ఇక ఫెదరర్‌తో గతంలో జరిగిన ఏడు మ్యాచుల్లో దిమిత్రోవ్ పరాజయం పాలయ్యాడు. 20 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేతైన ఫెదరర్ అనూహ్య రీతిలో ఇంటిదారి పట్టడంతో అభిమానులు నిరాశలో మునిగారు. మూడు గంటల 12 నిముషాల పాటు సాగిన క్వార్టర్ ఫైనల్లో ఫెదరర్ 61 తప్పిదాలు చేయడం గమనార్హం. 39 ఏళ్ల ఫెదరర్ ఆటమధ్యలో వీపు నొప్పికి ట్రీట్మెంట్ కోసం విరామం తీసుకున్నాడు. స్విస్ దిగ్గజం ఐదుసార్లు యూఎస్ ఓపెన్ సాధించిన సంగతి తెలిసిందే. -
క్వార్టర్స్‌లో సౌరవ్
షికాగో: మరోసారి అద్భుత ప్రదర్శన చేసిన భారత ఆటగాడు సౌరవ్ ఘోషాల్ ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 11వ సీడ్‌గా బరిలోకి దిగిన సౌరవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 11–13, 11–7, 11–7, 13–11తో జోయెల్ మాకిన్ (వేల్స్)పై చెమటోడ్చి నెగ్గాడు. రెండేళ్ల క్రితం ముంబైలో జరిగిన సీసీఐ ఇంటర్నేషనల్ ఈవెంట్లో ఇదే ప్రత్యర్థిపై అలవోకగా గెలిచిన భారత ఆటగాడికి ఈ మ్యాచ్‌లో మాత్రం గట్టిపోటీ ఎదురైంది. అన్‌సీడెడ్ మాకిన్ ప్రతి పాయింట్ కోసం పోరాడాడు. చివరకు సౌరవ్ ప్రదర్శన ముందు తలవంచాడు. ఈ టోర్నీలో భారత స్టార్ క్వార్టర్స్ చేరడం ఇది రెండోసారి. 2013లో కూడా సౌరవ్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశిం చాడు. నేడు జరిగే మ్యాచ్‌లో భారత ఆటగాడు... మూడో సీడ్ సైమన్ రోస్నెర్తో తలపడతాడు. -
అందరూ ముందుకు
పారిస్: భారత స్టార్ షట్లర్లంతా ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్ చేరారు. అయితే మహిళల డబుల్స్‌లో మేఘన–పూర్వీషా రామ్ జోడీకి ప్రి క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. గురు వారం జరిగిన మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ సింధు 21–17, 21–16తో సయాక సాటో (జపాన్)పై అలవోక విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 12–21, 21–16, 21–18తో లీ డాంగ్ కిన్ (కొరియా)పై చెమటోడ్చి నెగ్గాడు. గంటా 13 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో మొదటి గేమ్‌ను కోల్పోయిన భారత ఆటగాడు తర్వాత పుంజుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో సైనా కూడా శ్రీకాంత్‌లాగే తొలి గేమ్‌లో వెనుకబడినప్పటికీ తర్వాత రెండు గేముల్లోను ప్రత్యర్థిని చిత్తు చేసింది. డెన్మార్క్ ఓపెన్ రన్నరప్ అయిన సైనా 10–21, 21–14, 21–17తో మాజీ ప్రపంచ చాంపియన్, ఎనిమిదో సీడ్ నొజోమి ఒకుçహార (జపాన్)పై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–13, 21–19తో హి జితింగ్–తన్ కియాంగ్ (చైనా) జంటపై నెగ్గింది. మహిళల డబుల్స్‌లో మేఘన–పూర్వీష జోడి 15–21, 13–21తో నాలుగో సీడ్ గ్రేసియా పొలి–అప్రియని రహయు (ఇండోనేసియా) జంట చేతిలో ఓటమి చవిచూసింది. మరో వైపు ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ సింధు మళ్లీ రెండో ర్యాంకుకు ఎగబాకింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన తాజా మహిళల సింగిల్స్ ర్యాంకుల్లో ఆమె ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని టాప్–2లో కొనసాగుతోంది. గతేడాది ఏప్రిల్‌లో తొలిసారిగా ఆమె రెండో ర్యాంకులోకి వచ్చినా ఆ స్థానంలో పదిలంగా కొనసాగలేకపోయింది. -
క్వార్టర్స్‌లో శ్రీకృష్ణప్రియ, గురుసాయిదత్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) టూర్ సూపర్–100 హైదరాబాద్ ఓపెన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్లు కుదరవల్లి శ్రీకృష్ణప్రియ, గురుసాయిదత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మిక్స్డ్ డబుల్స్‌లో టాప్‌సీడ్ సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ కూడా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండోరౌండ్లో ఐదో సీడ్ శ్రీకృష్ణ ప్రియ 21–15, 21–18తో నున్టకర్న్ ఎమ్‌సార్డ్ (థాయ్‌లాండ్)పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో రసిక రాజే (భారత్) 21–19, 21–16తో చెంగ్ యింగ్ మయ్ (హాంకాంగ్)ను ఓడించి క్వార్టర్స్‌కు చేరుకుంది. పురుషుల విభాగంలో సమీర్ వర్మ, ప్రతుల్ జోషి, గురుసాయిదత్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్ మూడోరౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సమీర్‌వర్మ (భారత్) 21–14, 21–9తో కెవిన్ అరోకియా వాల్టేర్ (భారత్)పై, గురుసాయిదత్ 21–14, 21–13తో డేనియల్ ఫరీద్ (భారత్)పై గెలుపొందగా... ఐదోసీడ్ సౌరభ్ వర్మ 21–14, 13–21, 19–21తో ప్రతుల్ జోషి చేతిలో పోరాడి ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో చిరాగ్ సేన్ 16–21, 18–21తో అబ్దుల్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్, సిక్కిరెడ్డి తమ భాగస్వాములతో కలిసి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం 21–10, 22–20తో యెంగ్ షింగ్ చోయ్– ఫాన్ కా యాన్ (హాంకాంగ్) జోడీపై నెగ్గి క్వార్టర్స్ చేరుకుంది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో టాప్‌సీడ్ సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–13, 21–17తో బగాస్ మౌలానా–ప్రెంకీ విజయ పుత్ర (ఇండోనేసియా) జోడీపై, కోన తరుణ్ (భారత్)–లిమ్ ఖిమ్ వా (మలేసియా) జంట 21–23, 24–22, 22–20తో సుపక్ జోమ్కో–వచిరవిట్ సోథాన్ (థాయ్‌లాండ్) జోడీలపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. ఇతర మ్యాచ్‌ల్లో గారగ కృష్ణ ప్రసాద్–ధ్రువ్ కపిల జంట 16–21, 18–21తో నాలుగో సీడ్ అరుణ్ జార్జ్–సన్యం శుక్లా జోడీ చేతిలో, విష్ణువర్ధన్ గౌడ్–పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్ జంట 10–21, 15–21తో అక్బర్ బింటాంగ్–మోహ్ రిజా పహ్లెవి (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలయ్యాయి. మహిళల డబుల్స్ విభాగంలో జక్కంపూడి మేఘన–పూర్విషా రామ్ జంట 21–17, 21–9తో కావ్య గుప్తా–ఖుషి గుప్తా జోడీపై నెగ్గి రెండోరౌండ్లో అడుగుపెట్టింది. -
వికాస్ ముందంజ... హుసాముద్దీన్ ఓటమి
ఏషియాడ్ బాక్సింగ్‌లో ముగ్గురు భారత బాక్సర్లు వికాస్ కృషన్ (75 కేజీలు), అమిత్ (49 కేజీలు), ధీరజ్ (64 కేజీలు) క్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు. అయితే, కామన్వెల్త్ క్రీడల కాంస్య పతక విజేత, నిజామాబాద్ కుర్రాడు మొహమ్మద్ హుసాముద్దీన్ (56 కేజీలు) ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యాడు. హుసాముద్దీన్ 2–3తో కిర్గిస్తాన్‌కు చెందిన ఎంక్ అమర్ ఖర్ఖు చేతిలో ఓడిపోయాడు. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో హుసాముద్దీన్ నుదురుకు గాయమైంది. వికాస్ పదునైన పంచ్‌లతో 5–0తో తన్వీర్ అహ్మద్ (పాకిస్తాన్)పై... అమిత్ 5–0తో ఎన్ఖమన్‌దఖ్ ఖర్హు (మంగోలియా)పై... ధీరజ్ (64 కేజీలు) 3–0తో నుర్లాన్ కొబషెవ్ (మంగోలియా)పై గెలుపొందారు. -
పోర్చు‘గల్లంతు’
ఇటు అర్జెంటీనా... అటు పోర్చుగల్... ఒకే రోజు ఒకే తీరు ఫలితాలు... ఇద్దరు దిగ్గజాల కలలు కల్లలయ్యాయి. మొదట మెస్సీ చిరకాల స్వప్నాన్ని ఎంబాపె (ఫ్రాన్స్) తుడిచిపెడితే... తర్వాత రొనాల్డో ‘ఫిఫా’ వేటను కవాని (ఉరుగ్వే) ముగించాడు. దీంతో ప్రిక్వార్టర్స్‌లోనే మేటి జట్లు నాక్ ‘ఔట్’ అయ్యాయి. ఉరుగ్వే సుడి బాగుంది. రొనాల్డో జట్టును నాకౌట్ దెబ్బకొట్టింది. స్ట్రయికర్ కవాని ‘డబుల్’ ధమాకా పోర్చుగల్‌ను ఇంటిదారి పట్టించింది. మ్యాచ్‌లో ఉరుగ్వే ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. బంతి ఎక్కువగా ప్రత్యర్థి ఆధీనంలో ఉన్నప్పటికీ ఆధిపత్యం మాత్రం ఉరుగ్వేదే! ఒక దశలో ఉరుగ్వే ఆటగాళ్లు అలసిపోయినా... గెలిచేదాకా చెమట చిందించారు. ఈ పోరాటానికి, వీరి దుర్బేధ్యమైన డిఫెన్స్‌ను చూసి రొనాల్డోకు చిర్రెత్తిందేమో సహనం కోల్పోయి ‘ఎల్లో’కార్డు చూపించిన రిఫరీ మీదే ఒంటికాలిపై లేచాడు. స్ఫూర్తి మరిచాడు. సొచీ: పాపం... రొనాల్డోదీ మెస్సీ వ్యథే! పోర్చుగల్ జట్టుదీ అర్జెంటీనా బాటే! ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ అందించాలనుకున్న వీరిద్దరి ఆశలు ప్రిక్వార్టర్స్‌లోనే ఆవిరయ్యాయి. ప్రత్యర్థి పోరాటానికి సమకాలీన దిగ్గజాలు తలవంచక తప్పలేదు. నాకౌట్ దశ మొదలైన తొలి రోజే... ఫ్రాన్స్ దూకుడుకు అర్జెంటీనా, ఉరుగ్వే జోరులో పోర్చుగల్ గల్లంతయ్యాయి. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి మొదలైన రెండో నాకౌట్ మ్యాచ్‌లో ఉరుగ్వే 2–1తో ‘యూరో’ చాంపియన్ పోర్చుగల్‌ను కంగుతినిపించింది. అనుభవజ్ఞుడైన ఫార్వర్డ్ ఆటగాడు కవాని ఆరంభం నుంచి అంతా తానై నడిపించాడు. తొలి, రెండో అర్ధభాగాల్లో ఒక్కో గోల్ చేసి ఉరుగ్వేకు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఆట ఆరంభమైన ఏడు నిమిషాలకే సురెజ్ ఇచ్చిన పాస్ విజయవంతమైంది. పెనాల్టీ బాక్స్ వెలుపలి నుంచి సురెజ్ కొట్టిన షాట్‌ను స్ట్రయికర్ కవాని గోల్‌పోస్ట్ ముందే కాచుకున్నాడు. మెరుపు వేగంతో హెడర్ గోల్‌గా మలిచాడు. దీంతో ఉరుగ్వే శిబిరం సంబరాల్లో మునిగింది. స్కోరు సమం చేసేందుకు తొలి అర్ధభాగంలో పోర్చుగల్ స్ట్రయికర్లు పడ్డ కష్టమంతా వృథా అయింది. చురుగ్గా, తెలివిగా పాస్లిస్తున్నప్పటికీ ఏ ఒక్కటీ గోల్‌పోస్ట్‌ను ఛేదించలేకపోయింది. చివరకు రెండో అర్ధభాగం మొదలైన 10 నిమిషాలకు గురెరో ఇచ్చిన కార్నర్ పాస్‌ను పెపె (55వ ని.) గోల్‌పోస్ట్‌లోకి తరలించాడు. అయితే స్కోరు సమమైన పోర్చుగల్ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే మళ్లీ కవాని కదంతొక్కాడు. ఆట 62వ నిమిషంలో ఈ సారి బెటంకుర్ ఇచ్చిన పాస్‌ను కవాని ప్రత్యర్థి గోల్కీపర్ను బోల్తాకొట్టిస్తూ రెండో గోల్ సాధించాడు. ఆ తర్వాత పోర్చుగల్ ఎంత ప్రయత్నించినప్పటికీ గోల్ దిశగా సఫలం కాలేకపోయింది. ఆట 74వ నిమిషంలో కవాని కుడికాలికి గాయమవడంతో మైదానం వీడాడు. నొప్పితో విలవిలలాడుతున్న కవానికి రొనాల్డో సాయమందించాడు. ఈ మ్యాచ్ మొత్తం మీద పోర్చుగల్ షాట్లే ఎక్కువగా దూసుకొచ్చాయి. మ్యాచ్‌లో సింహభాగం వీరి స్ట్రయికర్ల ఆధీనంలోనే బంతి ఆడింది. దీంతో ఉరుగ్వే (273) కంటే పోర్చుగల్ (544) రెట్టింపు పాస్‌లను ప్లేస్ చేసింది. కానీ సరైన దిశ, ఫినిషింగ్ లేక మూల్యం చెల్లించుకుంది. పోర్చుగల్ 20 షాట్లు ప్రత్యర్థి పెనాల్టీ బాక్స్ దిశగా ఆడారు. ఇందులో ఐదుసార్లు లక్ష్యంపై గురిపెడితే ఒక్కసారి మాత్రమే గోల్ అయింది. మరోవైపు ప్రత్యర్థి షాట్లను ఎక్కడికక్కడ నిలువరించిన ఉరుగ్వే మాత్రం కొట్టింది ఐదు షాట్లే. లక్ష్యంపై మూడు సార్లు గురిపెట్టిన ఆ జట్టు రెండు సార్లు గోల్ చేయడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ ఫ్రాన్స్‌తో ఉరుగ్వే తలపడనుంది. ► ‘ఫిఫా’ ప్రపంచకప్ చరిత్రలో ఉరుగ్వే వరుసగా 4 మ్యాచ్‌లు గెలవడం ఇది రెండోసారి. 1930లో ఉరుగ్వే విజేతగా నిలిచిన టోర్నీలో ఇలాగే జరిగింది. రిఫరీపై రొనాల్డో ఆగ్రహం పోర్చుగల్ అభిమాని కంట కన్నీరు ప్రపంచకప్‌లో నేడు ప్రిక్వార్టర్ ఫైనల్స్ బ్రెజిల్ x మెక్సికో రా.గం. 7.30 నుంచి బెల్జియం x జపాన్ రా.గం. 11.30 నుంచి సోనీ ఈఎస్పీఎన్, సోనీ టెన్–2,3లలో ప్రత్యక్ష ప్రసారం -
క్వార్టర్స్‌లో బోపన్న జోడీ
క్లే కోర్టు సీజన్ తొలి మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్ మోంటెకార్లో ఓపెన్‌లో భారత డబుల్స్ నంబర్‌వన్ రోహన్ బోపన్న–రోజర్ వాసెలిన్ (నెదర్లాండ్స్) జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మొనాకోలోని మోంటెకార్లోలో జరుగుతున్న ఈ టోర్నీ ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ 3–6, 6–4, 11–9తో ఏడో సీడ్ జేమీ ముర్రే (బ్రిటన్)–బ్రూనో సోరెస్ (బ్రెజిల్)ద్వయంపై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో జాన్ సెబాస్టియన్–రాబర్ట్ ఫరాతో బోపన్న జంట తలపడనుంది. -
క్వార్టర్ ఫైనల్లో పంకజ్ అద్వానీ
ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఖతర్‌లోని దోహాలో శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో పంకజ్ 5–1 (69–8, 115–33, 75–56, 0–94, 101–18, 97–33) ఫ్రేమ్‌ల తేడాతో అసద్ ఇక్బాల్ (పాకిస్తాన్)పై విజయం సాధించాడు. ఆదివారం జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన 17 ఏళ్ల కుర్రాడు లువో హాంగ్హవోతో పంకజ్ తలపడతాడు. -
క్వార్టర్స్‌లో సాకేత్
పుణే: ఆంధ్రప్రదేశ్ ఆటగాడు, భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని పుణే ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సాకేత్ 4–6, 6–2, 6–0తో పెజ్దా క్రిస్టిన్ (సెర్బియా)పై గెలిచాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రామ్‌కుమార్ రామనాథన్ 7–6 (9/7), 6–3తో బ్రైడన్ క్లియెన్ (బ్రిటన్)పై, యూకీ బాంబ్రీ 6–4, 7–6 (7/4)తో పావిచ్ (క్రొయేషియా)పై గెలిచారు. -
క్వార్టర్స్‌లో సైనా, సింధు
కశ్యప్‌కు చుక్కెదురు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వుహాన్ (చైనా): ప్రపంచ నంబర్‌వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, యువ సంచలనం పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ క్వార్టర్‌ఫైనల్స్‌లో అడుగుపెట్టారు. గురువారం వుహాన్ స్పోర్ట్స్ సెంటర్ జిమ్నాజియంలో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన నొజోమి ఒకుహరాపై 21-14, 10-21, 21-10 తేడాతో సైనా నెహ్వాల్ నెగ్గింది. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో తను ఐదో సీడ్ జు యింగ్ తాయ్ (చైనీస్ తైపీ)ని ఎదుర్కొంటుంది. అటు ఎనిమిదో సీడ్ సింధు కేవలం 20 నిమిషాల్లోనే టెంగ్ ఇవోక్ యును 21-8, 21-9 తేడాతో సునాయాసంగా ఓడించింది. అయితే క్వార్టర్స్‌లో మాత్రం తనకు గట్టి పోటీనే ఎదురుకానుంది. టాప్ సీడ్ లి జురుయ్ (చైనా)తో సింధు ఆడాల్సి ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో హైదరాబాదీ ఆటగాడు పారుపల్లి కశ్యప్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో తను ఏడో సీడ్ జెంగ్‌మింగ్ వాంగ్ (చైనా) చేతిలో 23-21, 17-21, 8-21 తేడాతో పరాజయం పాలయ్యాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి, సుమీత్ రెడ్డి 10-21, 13-21 తేడాతో షియావోలాంగ్ లియు, జిహాన్ క్వి (చైనా) జంట చేతిలో ఓడారు. మిక్స్డ్ డబుల్స్‌లో అరుణ్ విష్ణు, అపర్ణా బాలన్ 13-21, 5-21 తేడాతో కాయ్‌లు, హువాంగ్ (చైనా) చేతిలో చిత్తయ్యారు. తొలి రౌండ్లో బై లభించడంతో పాటు రెండో రౌండ్లో వాకోవర్‌తో నేరుగా ప్రిక్వార్టర్స్‌కు చేరిన సైనాకు ప్రత్యర్థి ఒకుహరా నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. తొలి గేమ్‌లో 3-5తో వెనుకబడిన సైనా వరుసగా ఆరు పాయింట్లు సాధించి 9-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఒకుహరా కూడా వరుసగా నాలుగు పాయింట్లు సాధించినా ఆ తర్వాత సైనా జోరు ముందు నిలువలేకపోయింది. కానీ రెండో గేమ్‌లో మాత్రం ఒకుహరా తన వ్యూహాలను మార్చింది. దీంతో నేరుగా 5-0తో ఆధిక్యం సాధించడంతో పాటు సైనాకు అందకుండా దూసుకెళ్లి 21-10తో గేమ్‌ను నెగ్గి పోటీలో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం సైనా నిలకడైన ఆటతీరుతో పూర్తి ఆధిక్యం ప్రదర్శించింది. 4-6తో వెనుకబడిన దశ నుంచి 11-7తో ముందుకెళ్లింది. ఆ తర్వాత సైనా దూకుడును ఒకుహరా అడ్డుకోలేకపోయింది. దీంతో తొమ్మిది వరుస పాయింట్లతో సైనా గేమ్‌ను ముగించింది. మరోవైపు సింధుకు ప్రత్యర్థి నుంచి కనీస పోటీ కూడా ఎదురుకాలేదు. తొలి గేమ్‌లోనైతే వరుసగా పది పాయింట్లతో టెంగ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇదే జోరుతో రెండో గేమ్‌లోనూ ఆడి క్వార్టర్స్‌కు చేరింది. గత మ్యాచ్‌లో సుదీర్ఘ పోరులో తలపడిన కశ్యప్ ఆటతీరు ప్రిక్వార్టర్స్‌లో గతి తప్పింది. తొలి గేమ్ లో 0-5తో వెనుకబడినా 11-8తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే వాంగ్ స్కోరును 12-12తో సమం చేశాడు. జాగ్రత్తగా ఆడి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. కానీ అలసటతో కనిపించిన కశ్యప్ తర్వాతి రెండు గేమ్‌ల్లో ఓడాడు.