
షికాగో: మరోసారి అద్భుత ప్రదర్శన చేసిన భారత ఆటగాడు సౌరవ్ ఘోషాల్ ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 11వ సీడ్‌గా బరిలోకి దిగిన సౌరవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 11–13, 11–7, 11–7, 13–11తో జోయెల్ మాకిన్ (వేల్స్)పై చెమటోడ్చి నెగ్గాడు. రెండేళ్ల క్రితం ముంబైలో జరిగిన సీసీఐ ఇంటర్నేషనల్ ఈవెంట్‌లో ఇదే ప్రత్యర్థిపై అలవోకగా గెలిచిన భారత ఆటగాడికి ఈ మ్యాచ్‌లో మాత్రం గట్టిపోటీ ఎదురైంది.
అన్‌సీడెడ్ మాకిన్ ప్రతి పాయింట్ కోసం పోరాడాడు. చివరకు సౌరవ్ ప్రదర్శన ముందు తలవంచాడు. ఈ టోర్నీలో భారత స్టార్ క్వార్టర్స్ చేరడం ఇది రెండోసారి. 2013లో కూడా సౌరవ్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశిం చాడు. నేడు జరిగే మ్యాచ్‌లో భారత ఆటగాడు... మూడో సీడ్ సైమన్ రోస్నెర్‌తో తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment