పంకజ్‌ అద్వానీకి 6–రెడ్‌ స్నూకర్‌ టైటిల్‌ | Pankaj Advani 6-red snooker title | Sakshi
Sakshi News home page

పంకజ్‌ అద్వానీకి 6–రెడ్‌ స్నూకర్‌ టైటిల్‌

Published Fri, Dec 23 2016 11:49 PM | Last Updated on Mon, Oct 22 2018 5:42 PM

పంకజ్‌ అద్వానీకి 6–రెడ్‌ స్నూకర్‌ టైటిల్‌ - Sakshi

పంకజ్‌ అద్వానీకి 6–రెడ్‌ స్నూకర్‌ టైటిల్‌

ముంబై: ఇప్పటికే పలు ఫార్మాట్‌లలో 16 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత క్యూ స్పోర్ట్స్‌ (స్నూకర్, బిలియర్డ్స్‌) స్టార్‌ పంకజ్‌ అద్వానీ ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు. స్నూకర్‌లో పొట్టి ఫార్మాట్‌గా భావించే 6–రెడ్‌ స్నూకర్‌ జాతీయ టైటిల్‌ను ఈ బెంగళూరు ప్లేయర్‌ సొంతం చేసుకున్నాడు.

ఫైనల్లో పంకజ్‌ అద్వానీ 7–4 (40–7, 0–36, 55–1, 23–37, 45–13, 40–54, 49–6, 41–8, 6–38, 53–14, 38–17) ఫ్రేమ్‌ల తేడాతో కర్ణాటకకే చెందిన ఇష్‌ప్రీత్‌ చద్దాపై గెలుపొందాడు. ఈ విజయంతో జాతీయస్థాయిలో, ఆసియా స్థాయిలో, ప్రపంచ స్థాయిలో 6–రెడ్‌ స్నూకర్‌ టైటిల్స్‌ నెగ్గిన ఏకైక ప్లేయర్‌గా పంకజ్‌ గుర్తింపు పొందాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement