
అద్వానీకి జాతీయ టైటిల్
కోల్‌కతా: ప్రముఖ క్యూ యిస్ట్ పంకజ్ అద్వానీ సీనియర్ జాతీయ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలి చాడు. బెంగాల్ రోయిం గ్ క్లబ్‌లో శనివారం జరిగిన ఫైనల్లో ధ్రువ్ సిట్వాలాపై 5-0 తేడాతో అద్వానీ నెగ్గాడు. వివిధ విభాగాల్లో 12 ప్రపంచ టైటిల్స్ తన ఖాతాలో వేసుకున్న అద్వానీ రెండు, మూడో ఫ్రేమ్‌లో 150, 153 పాయింట్లతో క్లీన్‌స్వీప్ చేశాడు. 29 ఏళ్ల అద్వానీకిది ఏడో జాతీయ బిలియర్డ్స్ టైటిల్.