
దోహా: ఆసియా టీమ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ అద్వానీ, మల్కీత్ సింగ్‌లతో కూడిన భారత్–1 జట్టు రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్–1 జట్టు 2–3 (2–110, 81–47, 70–72, 107–5, 18–98) ఫ్రేమ్‌ల తేడాతో మొహమ్మద్ ఆసిఫ్, బాబర్ మసీలతో కూడిన పాకిస్తాన్–1 జట్టు చేతిలో ఓడిపోయింది.
సెమీఫైనల్స్‌లో భారత్–1 జట్టు 3–2 ఫ్రేమ్‌ల తేడాతో మొహమ్మద్ మాజిద్ అలీ, మొహమ్మద్ బిలాల్‌లతో కూడిన పాకిస్తాన్–2 జట్టుపై... పాకిస్తాన్–1 జట్టు 3–1 ఫ్రేమ్‌ల తేడాతో వు యిజి, పాంగ్‌జున్‌జులతో కూడిన చైనా జట్టుపై విజయం సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment