Asian Billiards Championship
-
ఆసియా స్నూకర్ రన్నరప్ భారత్
దోహా: ఆసియా టీమ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ అద్వానీ, మల్కీత్ సింగ్‌లతో కూడిన భారత్–1 జట్టు రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్–1 జట్టు 2–3 (2–110, 81–47, 70–72, 107–5, 18–98) ఫ్రేమ్‌ల తేడాతో మొహమ్మద్ ఆసిఫ్, బాబర్ మసీలతో కూడిన పాకిస్తాన్–1 జట్టు చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్స్‌లో భారత్–1 జట్టు 3–2 ఫ్రేమ్‌ల తేడాతో మొహమ్మద్ మాజిద్ అలీ, మొహమ్మద్ బిలాల్‌లతో కూడిన పాకిస్తాన్–2 జట్టుపై... పాకిస్తాన్–1 జట్టు 3–1 ఫ్రేమ్‌ల తేడాతో వు యిజి, పాంగ్‌జున్‌జులతో కూడిన చైనా జట్టుపై విజయం సాధించాయి. -
పంకజ్ ఏడోస్సారి...
యాంగాన్ (మయన్మార్): ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ టైటిల్ నిలబెట్టుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ బెంగళూరు ప్లేయర్ ఫైనల్లో 6–1 ఫ్రేమ్‌ల తేడాతో భారత్‌కే చెందిన బాలచంద్ర భాస్కర్‌ను ఓడించాడు. ఓవరాల్‌గా పంకజ్‌కిది ఏడో ఆసియా బిలియర్డ్స్ టైటిల్ కావడం విశేషం. గతంలో 2017, 2012, 2010, 2009, 2008, 2005లలో విజేతగా నిలిచాడు. అమీ కమాని అద్భుతం: ఇదే వేదికపై జరిగిన ఆసియా మహిళల స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి అమీ కమాని విజేతగా నిలిచింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఇండోర్‌కు చెందిన అమీకమాని ఫైనల్లో 3–0తో సిరిపపోర్న్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. -
ఫైనల్లో పంకజ్
యాంగాన్ (మయన్మార్): ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నిలబెట్టుకునేందుకు భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ మరో విజయం దూరంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 5–1తో (100–72, 0–100, 100–30, 100–2, 100–6, 100–0) ధ్వజ్ హరియా (భారత్)పై గెలిచాడు. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో ఇదే స్కోరుతో అంగ్ హెతె (మయన్మార్)ను ఓడించాడు. -
పంకజ్ శుభారంభం
యాంగాన్ (మయన్మార్): ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ పంకజ్ అద్వానీ శుభారంభం చేశాడు. తొలి లీగ్ మ్యాచ్‌లో పంకజ్ 4–0తో యో టెక్ షిన్ (సింగపూర్)పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో రూపేశ్ షా (భారత్) 4–0తో సిహోమ్బింగ్ (ఇండోనేసియా)పై నెగ్గాడు. -
ఆసియా బిలియర్డ్స్ టోర్నీ విజేత అద్వానీ
భారత క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ తన ఖాతాలో మరో అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. చండీగఢ్‌లో శుక్రవారం ముగిసిన ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ విజేతగా నిలిచాడు. భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారితో జరిగిన ఫైనల్లో అద్వానీ 6–3 (54–101, 89–100, 100–9, 58–101, 100–0, 102–0, 100–0, 100–42, 101–0) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. అద్వానీ కెరీర్లో ఓవరాల్‌గా ఇది ఏడో ఆసియా టైటిల్. -
ఆసియా బిలియర్డ్స్: అద్వానీ ఓటమి
కొలంబో: ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన భాస్కర్ బాలచంద్ర 5-3 (102-0, 4-101, 102-80, 71-102, 100-94, 0-102, 101-32, 101-99) ఫ్రేమ్‌ల తేడాతో అద్వానీని ఓడించి సెమీఫైనల్‌కు చేరాడు. భారత ఆటగాళ్లు సిద్ధార్థ్ పారిఖ్, ధ్రువ్ సిత్వాలా కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్‌లో ధ్రువ్‌తో సిద్ధార్థ్; పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)తో భాస్కర్ తలపడతారు.