
యాంగాన్ (మయన్మార్): ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ టైటిల్ నిలబెట్టుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ బెంగళూరు ప్లేయర్ ఫైనల్లో 6–1 ఫ్రేమ్‌ల తేడాతో భారత్‌కే చెందిన బాలచంద్ర భాస్కర్‌ను ఓడించాడు. ఓవరాల్‌గా పంకజ్‌కిది ఏడో ఆసియా బిలియర్డ్స్ టైటిల్ కావడం విశేషం. గతంలో 2017, 2012, 2010, 2009, 2008, 2005లలో విజేతగా నిలిచాడు.
అమీ కమాని అద్భుతం: ఇదే వేదికపై జరిగిన ఆసియా మహిళల స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి అమీ కమాని విజేతగా నిలిచింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఇండోర్‌కు చెందిన అమీకమాని ఫైనల్లో 3–0తో సిరిపపోర్న్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment