
దోహా: భారత మేటి క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) ప్లేయర్ పంకజ్ అద్వానీ ఎనిమిదోసారి ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచాడు. శనివారం జరిగిన ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో 36 ఏళ్ల పంకజ్ 6–2 (101–66, 100–0, 101–29, 44–100, 104–90, 101–21, 88–100, 101–78) ఫ్రేమ్‌ల తేడాతో భారత్‌కే చెందిన ధ్రువ్ సిత్వాలాపై గెలుపొందాడు. 2005, 2008, 2009, 2010, 2012, 2017, 2018లలో కూడా పంకజ్ ఆసియా బిలియర్డ్స్ టైటిల్‌ను సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment