
పంకజ్ అద్వానీ–మానన్ చంద్ర
దోహా: తొలిసారి నిర్వహించిన ప్రపంచ స్నూకర్ కప్ టీమ్ ఈవెంట్‌లో భారత్–1 జట్టు టైటిల్ సొంతం చేసుకుంది. శుక్రవారం దోహాలో జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ–మానన్ చంద్రలతో కూడిన భారత్ 3–2తో మొహమ్మద్ ఆసిఫ్–బాబర్ మసీ సభ్యులుగా ఉన్న పాకిస్తాన్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో మానన్ చంద్ర 24–73తో బాబర్ చేతిలో... రెండో మ్యాచ్‌లో పంకజ్ అద్వానీ 56–61తో ఆసిఫ్ చేతిలో ఓడిపోవడంతో భారత్ 0–2తో వెనుకబడింది.
అయితే మూడో మ్యాచ్‌లో పంకజ్–మానన్ చంద్ర ద్వయం 72–47తో ఆసిఫ్–బాబర్ జంటపై గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నాలుగో మ్యాచ్‌లో పంకజ్ 106–20తో బాబర్‌పై... ఐదో మ్యాచ్‌లో మానన్ చంద్ర 56–20తో ఆసిఫ్‌పై నెగ్గడంతో భారత్ విజయం ఖాయమైంది.
Comments
Please login to add a commentAdd a comment