World Snooker
-
ప్రపంచ స్నూకర్ కప్ విజేత భారత్
దోహా: తొలిసారి నిర్వహించిన ప్రపంచ స్నూకర్ కప్ టీమ్ ఈవెంట్లో భారత్–1 జట్టు టైటిల్ సొంతం చేసుకుంది. శుక్రవారం దోహాలో జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ–మానన్ చంద్రలతో కూడిన భారత్ 3–2తో మొహమ్మద్ ఆసిఫ్–బాబర్ మసీ సభ్యులుగా ఉన్న పాకిస్తాన్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో మానన్ చంద్ర 24–73తో బాబర్ చేతిలో... రెండో మ్యాచ్‌లో పంకజ్ అద్వానీ 56–61తో ఆసిఫ్ చేతిలో ఓడిపోవడంతో భారత్ 0–2తో వెనుకబడింది. అయితే మూడో మ్యాచ్‌లో పంకజ్–మానన్ చంద్ర ద్వయం 72–47తో ఆసిఫ్–బాబర్ జంటపై గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నాలుగో మ్యాచ్‌లో పంకజ్ 106–20తో బాబర్‌పై... ఐదో మ్యాచ్‌లో మానన్ చంద్ర 56–20తో ఆసిఫ్‌పై నెగ్గడంతో భారత్ విజయం ఖాయమైంది. -
సెమీస్‌లో పంకజ్ అద్వానీ
హర్గాడా (ఈజిప్టు): అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ పంకజ్ అద్వానీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో పంకజ్ అద్వానీ 6-0 (70-62, 112-0, 107-14, 83-46, 114-12, 64-27) ఫ్రేమ్‌ల తేడాతో అలెక్స్ బోర్గ్ (మాల్టా)పై విజయం సాధించాడు. సెమీఫైనల్లో లుకాస్ క్లెకెర్స్ (జర్మనీ)తో అద్వానీ తలపడతాడు. ఇప్పటికే 14 సార్లు ప్రపంచ టైటిల్స్‌ను నెగ్గిన అద్వానీ ఈ టోర్నీలో సెమీస్‌కు చేరడం ద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు.