పద్మభూషణ్‌కు పంకజ్ పేరు | Pankaj Advani recommended for Padma Bhushan | Sakshi
Sakshi News home page

పద్మభూషణ్‌కు పంకజ్ పేరు

Published Fri, Sep 9 2016 1:28 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

పద్మభూషణ్‌కు పంకజ్ పేరు

పద్మభూషణ్‌కు పంకజ్ పేరు

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి బిలియర్డ్స్ చాంపియన్ పంకజ్ అద్వానీ పేరును మరోసారి ప్రతిపాదించారు. గతేడాది కూడా అతడి పేరును భారత బిలియర్డ్‌అండ్ స్నూకర్ సమాఖ్య (బీఎస్‌ఎఫ్‌ఐ) పంపించింది. ‘వరుసగా రెండో ఏడాది కూడా పంకజ్ పేరును మేం ప్రతిపాదించాం. అతడు కచ్చితంగా ఈ పురస్కారానికి అర్హుడు. ఈసారి మాకు నిరాశ కలగదనే అనుకుంటున్నాం’ అని బీఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి ఎస్.బాలసుబ్రమణియన్ తెలిపారు.  పంకజ్‌కు గతంలో పద్మశ్రీ, ఖేల్త్న్ర, అర్జున అవార్డులు దక్కాయి.   క్వార్టర్స్‌లో అద్వానీ : బ్యాంకాక్‌లో జరుగుతున్న సాంగ్‌సోమ్ 6 రెడ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పంకజ్ అద్వానీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. గ్రూప్ దశలో ఒక్క ఓటమి లేకుండా దూసుకెళ్లిన పంకజ్ ... ప్రిక్వార్టర్స్‌లో యువాన్ సిజున్ (చైనా)పై 5-4తో గెలిచాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement