రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాలను స్వీకరిస్తున్న భారత క్రికెటర్ ధోని, క్యూ స్పోర్ట్స్ ప్లేయర్ పంకజ్ అద్వానీ
న్యూఢిల్లీ: ఏప్రిల్ 2, 2011... భారత క్రికెట్ అభిమానులు మర్చిపోలేని రోజు. ధోని సిక్సర్‌తో వన్డే ప్రపంచకప్ అందించిన రోజు. ఇపుడు సరిగ్గా ఏడేళ్ల తర్వాత మళ్లీ ఏప్రిల్ 2న ధోని ‘పద్మభూషణ్’ అవార్డు అందుకున్నాడు. భారత మూడో అత్యున్నత పౌర పురస్కారమైన ఈ అవార్డును మాజీ కెప్టెన్ ఆర్మీ డ్రెస్‌లో అందుకోవడం మరో విశేషం. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగిన ఈ వేడుకలో లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ హోదా) అయిన ధోని... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకునేందుకు మిలిటరీ డ్రస్‌లో వచ్చాడు.
2007లో టి20 ప్రపంచకప్, అనంతరం వన్డే ప్రపంచకప్ అందించిన ధోనిని భారత ఆర్మీ 2011, నవంబర్ 1న లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో సత్కరించింది. రెండు ఆసియా గేమ్స్ (2006, 2010)లలో భారత్‌కు బంగారు పతకాలు అందించడంతోపాటు కెరీర్‌లో మొత్తం 19 సార్లు వివిధ ఫార్మాట్‌లలో ప్రపంచ టైటిల్స్ నెగ్గిన క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీకి కూడా రాష్ట్రపతి
‘పద్మభూషణ్’ అవార్డు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment