'కరాచీ నగరం ముంబయి లాంటిదే'
కరాచీ: పాకిస్తాన్, భారత్కు చాలా వ్యత్యాసం లేదని, కరాచీ నగరం ముంబయి లాంటిదేదనని భారత సూకర్ స్టార్ పంకజ్ వ్యాఖ్యానించాడు. పాక్ టూర్ కు వెళ్లేముందు జూనియర్ ఆటగాళ్లకు తాను ఈ విధంగా చెప్పినట్లు మ్యాచ్ అనంతరం తెలిపాడు. ఆసియాలోనే మేజర్ స్నూకర్ కేంద్రంగా పాక్ మారనుందని అన్నాడు. స్నూకర్ చాంపియన్షిప్ నిర్వహించిన పాక్ ను అద్వానీ ప్రశంసించాడు. క్రికెట్కు ఉన్నట్లే బిలియర్డ్స్, స్నూకర్ గేమ్స్కూ ఐపీఎల్ లీగ్ వంటివి ఉంటే తమకు బాగా కలిసొస్తుందని అద్వానీ ఆశాభావం వ్యక్తం చేశాడు. మంగళవారం జరిగిన ప్రపంచ 6-రెడ్ స్నూకర్ చాంపియన్షిప్ సాధించిన తర్వాత ఈ విధంగా తన ఉద్దేశాన్ని తెలిపాడు.
కెరీర్లో 13 స్నూకర్ టైటిల్స్ సాధించిన అనంతరం అద్వానీ మాట్లాడుతూ.. ఐపీఎల్ లీగ్ వంటివి బిలయర్డ్స్, స్నూకర్ గేమ్స్లకూ నిర్వహిస్తే అది తమకు ఆర్థికంగా ప్రయోజనకరమని అన్నాడు. ఈ ఆటలకు చాలా తక్కువ సమయం కేటాయించి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారన్నాడు. టోర్నీలో తొలి గేమ్ ఓటమికి అక్కడికి ఆలస్యంగా చేరుకోవడమే కారణమని తాను భావిస్తున్నట్లు చెప్పాడు.