పంకజ్‌కు మూడో గెలుపు | Pankaj Advani, Kamal Chawla inch closer to World Snooker knockouts | Sakshi
Sakshi News home page

పంకజ్‌కు మూడో గెలుపు

Published Sat, Nov 22 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

పంకజ్‌కు మూడో గెలుపు

పంకజ్‌కు మూడో గెలుపు

 ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్
 
 బెంగళూరు: తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేశాడు. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘హెచ్' లీగ్ మ్యాచ్‌లో పంకజ్ 4-0 (103-4, 119-7, 56-26, 136-0) ఫ్రేమ్‌ల తేడాతో పాల్ ష్కాఫ్ (ఆస్ట్రియా)పై గెలిచాడు. హైదరాబాద్ ప్లేయర్ లక్కీ వత్నాని వరుసగా రెండో మ్యాచ్‌లో నెగ్గాడు.

హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో లక్కీ 4-3 (14-65, 30-75, 86-22, 65-43, 46-54, 88-0, 65-22) ఫ్రేమ్‌ల తేడాతో నొబ్రెస్ (బ్రెజిల్)ను ఓడించాడు. లీగ్ మ్యాచ్‌లు ముగిశాక మొత్తం 16 గ్రూప్‌ల నుంచి నలుగురు చొప్పున 64 మంది నాకౌట్ దశకు అర్హత సాధిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement