
అద్వానీకి కాంస్యం
భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ ఖాతాలో మరో ఘనత చేరింది. 6-రెడ్ స్నూకర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో...
బ్యాంకాక్ (థాయ్‌లాండ్): భారత స్టార్ క్యూరుుస్ట్ పంకజ్ అద్వానీ ఖాతాలో మరో ఘనత చేరింది. 6-రెడ్ స్నూకర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పంకజ్ కాంస్య పతకం గెలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా అతను చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 4-7 (0-37, 68-0, 73-0, 41-26, 49-15, 7-57, 0-57, 67-0, 57-0, 20-34, 69-9) ఫ్రేమ్‌ల తేడాతో డింగ్ జున్‌హుయ్ (చైనా) చేతిలో ఓడిపోరుు కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఇప్పటికే పంకజ్ బిలియర్డ్స్, స్నూకర్ విభాగాల్లో మొత్తం 15 ప్రపంచ టైటిల్స్ సాధించాడు.