under 23 tourny
-
అంజలి అద్భుతం
సాక్షి, మంగళగిరి: బీసీసీఐ జాతీయ మహిళల అండర్ –23 వన్డే ట్రోఫీ క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఒడిశా జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్ లో ఆంధ్ర ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఒడిశాను ఆంధ్ర బౌలర్లు అంజలి శర్వాణి (6/11), సింధూజ (3/7) హడలెత్తించారు. ఫలితంగా ఒడిశా 34.1 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆంధ్ర 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసి గెలిచింది. శిరీష (20 నాటౌట్), అంజలి (10 నాటౌట్) రాణించారు. -
రన్నరప్ యువ భారత్
న్యూఢిల్లీ: తొలిసారి ఆసియా అండర్–23 పురుషుల వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవాలని ఆశించిన భారత జట్టు తుది మెట్టుపై తడబడింది. మయన్మార్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 21–25, 20–25, 25–19, 23–25తో చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఈ టోర్నీలో భారత్ మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడింది. చైనా, న్యూజిలాండ్, కజకిస్తాన్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లపై గెలిచి జపాన్, థాయ్‌లాండ్, చైనీస్ తైపీ జట్ల చేతిలో ఓడింది. ఈ టోర్నీలో విజేత చైనీస్ తైపీ, రన్నరప్ భారత్ జట్లు అండర్–23 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించాయి. -
హైదరాబాద్, మహారాష్ట్ర మ్యాచ్ డ్రా
కల్నల్ సీకే నాయుడు టోర్నీ సాక్షి, హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు అండర్-23 క్రికెట్ టోర్నీలో భాగంగా హైదరాబాద్, మహారాష్ట్ర జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది. నాలుగోరోజు ఆటను 54/3 ఓవర్‌నైట్ స్కోరుతో ప్రారంభించిన హైదరాబాద్ రెండో ఇన్నింగ్సలో 253 పరుగులకు ఆలౌటైంది. రాధాకృష్ణ (99) తృటిలో సెంచరీని చేజార్చుకోగా... తనయ్ త్యాగరాజన్ (50) అర్ధసెంచరీ చేశాడు. అనంతరం 146 పరుగుల లక్ష్య ఛేదన కోసం రెండో ఇన్నింగ్‌సను ప్రారంభించిన మహారాష్ట్ర ఆట ముగిసే సమయానికి 7.5 ఓవర్లలో 3 వికెట్లకు 40 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. హైదరాబాద్ బౌలర్లలో రాధాకృష్ణ 2 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన మహారాష్ట్రకు 3 పాయింట్లు దక్కగా... హైదరాబాద్ ఖాతాలో ఒక పాయింట్ చేరింది.