
సాక్షి, మంగళగిరి: బీసీసీఐ జాతీయ మహిళల అండర్ –23 వన్డే ట్రోఫీ క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఒడిశా జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్ లో ఆంధ్ర ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఒడిశాను ఆంధ్ర బౌలర్లు అంజలి శర్వాణి (6/11), సింధూజ (3/7) హడలెత్తించారు. ఫలితంగా ఒడిశా 34.1 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆంధ్ర 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసి గెలిచింది. శిరీష (20 నాటౌట్), అంజలి (10 నాటౌట్) రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment