
జొహర్ బారు (మలేసియా): ఆరంభంలోనే దక్కిన ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయిన భారత యువ హాకీ జట్టు... సుల్తాన్ జొహర్ కప్ అండర్–18 టోర్నీలో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 2–3 గోల్స్ తేడాతో బ్రిటన్ చేతిలో ఓడిపోయింది. నాలుగో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి విష్ణుకాంత్ సింగ్ టీమిండియాకు ఆధిక్యం అందించాడు.
అయితే, డానియెల్ వెస్ట్ 7వ నిమిషంలో ఫీల్డ్ గోల్‌తో బ్రిటన్ స్కోరు సమం చేసింది. పోటాపోటీగా సాగిన రెండో భాగంలో మరో గోల్ నమోదు కాలేదు. మూడో భాగంలో జేమ్స్ ఓట్స్ (39వ ని., 42వ ని.) విజృంభణతో బ్రిటన్ 3–1తో ఆధిక్యంలోకి వెళ్లిపోయింది. తర్వాత భారత్ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 55వ నిమిషంలో అభిషేక్ గోల్ చేసినా అది స్కోరు అంతరం తగ్గించడానికే ఉపయోగపడింది.
Comments
Please login to add a commentAdd a comment